పోటీ నుంచి తప్పుకొన్న ఎల్ రమణ

టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ఆయన ప్రకటించారు. ఆయన జగిత్యాల శాసనసభ స్థానం నుంచి పోటీ చేయాల్సి ఉంది. ఐతే, మహాకూటమిలో భాగంగా ఆ స్థానాన్ని కాంగ్రెస్ బలంగా కోరుకుంటోంది. ఈ నేపథ్యంలో ఎల్ రమణ స్వత్రంత్రంగా పోటీ నుంచి తప్పకొని పెద్ద మనసు చాటారు. అంతేకాదు.. జగిత్యాల కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

1994లో తొలిసారి జగిత్యాల నుంచి టీడీపీ తరపున పోటీ చేసి రమణ గెలుపొందారు. అనంతరం అక్కడ నుంచి ఐదు సార్లు పోటీ చేశారు. మంత్రిగా బాధ్యతలను నిర్వహించారు. అలాంటి నేపథ్యం ఉన్న ఎల్ రమణ పోటీ నుంచి తప్పుకోవడం ఆయన అభిమానులకి నచ్చడం లేదు. అయినా.. మహాకూటమిలో కీలక పాత్ర పోషిస్తున్న రమణ పోటీ నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించి.. కూటమి సూత్రాలని పాటిస్తున్నారు.