లష్కర్‌ బోనాలు 2021 : భవిష్యవాణి చెప్పిన స్వర్ణలత

లష్కర్‌ బోనాల సందర్భంగా సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో రంగం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. మహమ్మారి ప్రజలను చాలా ఇబ్బందులు పెట్టినా నన్ను నమ్మి పూజలు చేశారు. వర్షాల వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారు. నేను మీ వెంట ఉండి నడిపిస్తా. అమ్మకి ఇంత చేసినా ఏం ఒరగలేదు అనొద్దు.. ప్రతి ఒక్కరినీ నేను కాచుకుంటా. ప్రజలకు ఎలాంటి ఆపదా రానివ్వను’’ అని తెలిపారు.