వైఎస్ జగన్ పై మరోసారి తీవ్ర విమర్శలు చేసిన లోకేష్

వినాయక చవితి ఉత్సవాలపై ఏపీ సర్కారు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ప్రభుత్వంపై పలు విమర్శలు వస్తున్న తరుణంలో తాజాగా ఈ రోజు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైఎస్ జగన్ పై విమర్శలు గుప్పించారు. మీ నాన్న గారి జయంతి-వర్ధంతి, మీ వివాహ వార్షిక వేడుకలు, వైకాపా నాయకుల వ్యక్తిగత కార్యక్రమాలకు అడ్డురాని కోవిడ్ నిబంధనలు ఒక్క వినాయక చవితికి మాత్రమే ఎందుకు అడ్డొచ్చాయి జగన్ రెడ్డి గారు? కడప జిల్లా ప్రొద్దుటూరులో కనీస కోవిడ్ నిబంధనలు పాటించకుండా స్థానిక ఎమ్మెల్యే కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సలహాదారుడు సజ్జల రెడ్డి , మంత్రి కన్నబాబు, ఎంపీ అవినాష్ రెడ్డి కూడా హాజరయ్యారు. మీరంతా కోవిడియట్స్ లా వ్యవహరిస్తూ… సూపర్ స్ప్రెడర్లుగా విచ్చలవిడిగా తిరుగుతుంటే కరోనా వ్యాపించదా? వినాయకచవితి జరుపుకుంటేనే కోవిడ్ కోరలు చాస్తుందా? అని అన్నారు.