ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి మృతి

వైసీపీ పార్టీ లో విషాద ఛాయలు అల్లుకున్నాయి. గుండెపోటుతో ఏపీ పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి(50) హఠాన్మరణం చెందారు. సోమవారం ఉదయం గుండెపోటు రావడం తో వెంటనే కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రి కి తరలించారు. హాస్పటల్ కు వెళ్లే లోపు ఆయన మృతి చెందారు. వారం రోజులపాటు దుబాయ్‌లో పర్యటించిన మేకపాటి ఆదివారమే హైదరాబాద్‌కు తిరిగొచ్చారు.

మాజీ ఎంపీ రాజమోహన్‌రెడ్డి కుమారుడు గౌతమ్‌రెడ్డి. 1971 నవంబర్‌2న జన్మించిన మేకపాటి గౌతమ్‌రెడ్డి ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్‌ యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ పూర్తి చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికలతో గౌతమ్‌ రెడ్డి రాజకీయ అరంగేట్రం చేశారు. నెల్లూరు జిల్లా అత్మకూరు నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేసి గెలుపొందారు. రెండుసార్లు ఆత్మకూరు ఎమ్మెల్యేగా గెలిచారు.