మన ప్రధాని ఏంటి ఇలాంటి పని చేసారు…

modi-thappuభారత ప్రధాని మోడీ ప్రస్తుతం రష్యా పర్యటనలో ఉన్న సంగతి తెల్సిందే..అయితే ఈ పర్యటనలో మోడీ పెద్ద తప్పు చేసాడు..ఇది కావాలని చేసాడా..? లేకపోతే పొరపాటున జరిగిందో తెలియదు కానీ ఇప్పుడు రాజకీయంగా పెద్ద దుమారం రేపుతుంది..ఇంతకి ఈ తప్పు ఏంటో ఇప్పుడు చూద్దాం..

రష్యా పర్యటన లో భాగంగా బుధవారం మాస్కో ఎయిర్ పోర్టులో రష్యన్ మిలిటరీ బృందం మన జాతీయగీతం ఆలపించడం మొదలు పెట్టగానే మోడీ అక్కడి నుండి ముందుకు నడవం జరిగింది..అది చూసిన ఓ అధికారి వెంటనే ఆయనను వెనక్కి లాగారు. మరో అధికారి చేసిన సైగను తప్పుగా అర్థం చేసుకుని మోడీ ఇలా ముందుకు నడవడం జరిగిందని ప్రత్యేక సాక్షులు చెపుతున్నారు..కానీ కాంగ్రెస్ నాయకులు మాత్రం ప్రధాని ప్రోటోకాల్ ను అతిక్రమించారని, మన దేశానికి అప్రదిష్ట తెచ్చారని వారు వాదిస్తున్నారు..మొత్తానికి మోడీ తెలియక చేసిన తప్పును వారు మాత్రం ఇదో అవకాశం అనే రీతిలో మండిపడుతున్నారు.