మూడు రాజధానులపై కేటీఆర్ వివాదాస్పదవ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాజధాని వివాదంపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణలో 10 జిల్లాలను 33 జిల్లాలుగా విభజన చేశామన్నారు. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాక రాష్ట్రంలో రవ్వంత కూడా వ్యతిరేకత రాలేదని అన్నారు. కానీ ఏపీలో రాజధాని విషయంలో వ్యతిరేకత వస్తోందని ఎందుకనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

తెలంగాణ ఎన్నికల సందర్బంగా మంత్రి కేటీఆర్ శుక్రవారం మీడియా సమావేశంలో చిట్ చాట్‌ చేశారు. అందులో భాగంగా ఏపీ రాజధాని అమరావతిపై ఆయన మాట్లాడారు. ఏపీలో మూడు రాజధానులు ఉండవచ్చునని సీఎం జగన్ ప్రకటన తర్వాత ఒక్కసారిగా విమర్శలు, ఆందోళనలు జరగుతున్నాయన్నారు. అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల రైతులు పెద్ద ఎత్తు ఉద్యమాలు చేస్తున్నారన్నారు.