ముద్రగడ అరెస్ట్

mudragada
తుని రైలు దహనం ఘటనకు సంబంధించి అరెస్టులు మొదలయ్యాయి. కాపు గర్జన సందర్భంగా జరిగిన ఈ విధ్వంసానికి సంబంధించి నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ అరెస్టులపై మాజీ మంత్రి, కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం అభ్యంతరం వ్యక్తం చేశారు. తన అనుచరులు, కాపు నాయకులతో కలిసి అమలాపురం పోలీసు స్టేషన్‌ ఎదుట బైఠాయించారు. ”ముందుగా నన్ను అరెస్టు చేయండి.. అరెస్టు చేసేంత వరకు కదిలేదని లేదని” పోలీసులకు స్పష్టం చేశారు ముద్రగడ . అరెస్టులపై పోలీసులు ముద్రగడకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఆయన వినలేదు. ఈ నేపధ్యంలో అక్కడ ఉత్కంఠ నెలకొంది. దీంతో ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేసిరాజమండ్రిలోని సీఐడీ కార్యాలయానికి తరలించారు.