National Science Day : శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా సైన్స్ డే వేడుకలు

సత్తుపల్లి, ఫిబ్రవరి 28 : శాస్త్ర, సాంకేతికతలో దేశ ఔనత్యాన్ని చాటి చెప్పిన సీవీ.రామన్‌ స్ఫూర్తితో విద్యార్థులు పరిశోధనల్లో రాణించి నూతన అంశాలను ఆవిష్కరించాలని కమాండర్ శ్రీ. పి. వెంకట రాములు అన్నారు. జాతీయ సైన్స్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని సత్తుపల్లి లోని స్థానిక శ్రీ చైతన్య (సత్తుపల్లి విద్యాలయం మరియు కృష్ణవేణి ) స్కూల్ లో జరిగిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.


ఈ సందర్భంగా డిప్యూటీ జిఎమ్ సింగరేణి వెంకట చారితో కలిసి సీవీ.రామన్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులు తయారు చేసిన సైన్స్‌ ప్రదర్శనలను తిలకించి.. విద్యార్థుల కృషిని అభినందిస్తూ..విద్యార్థులను ప్రోత్సహించిన తల్లిదండ్రులకు , ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలియజేశారు. సైన్స్‌ ఆవిష్కరణలపై వివరించి విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు. మారుతున్న కాలానుగుణంగా విద్యార్థులు సైన్స్‌ అంశాలపై దృష్టి ఉంచి పరిశోధనలో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన యాజమాన్యం చైర్మన్ ఎమ్. శ్రీధర్ , ఎమ్. శ్రీవిద్య , డీజీఎం చేతన్ మరియు ఏజీఎం రమేష్ గార్లకు ప్రిన్సిపాల్ మరియు సిబ్బంది ధన్యవాదాలు తెలియజేశారు.