దేశభక్తిలో కల్తీ వుండకూడదు : మోడీ

modiతల్లిపాలలో కల్తీ ఉండదని, అలాగే దేశభక్తిలో కూడా కల్తీ ఉండకూడదని గుజారాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ అన్నారు. నర్మదా నది తీరంలో ఏర్పాటు చేసిన సర్దార్ విగ్రహానికి మోడీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ… ఇప్పుడు దేశంలో కుల, మత, ప్రాంత, జాతి రాజకీయాలు దేశాన్ని పతనస్థితికి తీసుకెళ్లాయని అన్నారు. భారతమాత గౌరవాన్ని ఉన్నతస్థితికి తీసుకెళ్లాలని, అందుకు కొన్ని ఉత్తమ మార్గాలు ఎంచుకోవాలని, అందుకే తాము పటేల్ విగ్రహ నిర్మాణ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. పటేల్ విగ్రహం నిర్మాణం ద్వారా దేశం నలుమూలలా ఐక్యతా మంత్రాన్ని చాటుతామని మోడీ ఉద్ఘాటించారు.

పటేల్ విగ్రహం ఏర్పాటు చేస్తుంటే.. అందరూ ఎందుకు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారని, విగ్రహ నిర్మాణం కోసం తాము దేశాన్ని ఏకీకరణ చేయాలనుకుంటున్నామని తెలిపారు. అందుకే ప్రతి గ్రామం పాత ఇనుపసామాన్లు విరాళంగా ఇవ్వాలని అడిగామని, దాన్ని చాలా మంది తప్పు పడుతున్నారని, వారి ఆలోచనలు తప్పులతో నిండిపోయాయని, అందుకే అలా మాట్లాడుతున్నారని అన్నారు. కానీ, తాము అలా సేకరించిన ఇనుము నుంచి శ్రేష్ఠమైన లోహాన్ని రాబట్టి అతి పెద్ద విగ్రహాన్ని తయారు చేస్తామని తెలిపారు.

సంస్థానాలను విలీనం చేయించిన ఘనత పటేల్‌దే: అద్వానీ

adబీజేపీ అగ్రనేత అద్వానీ మాట్లాడుతూ… సంస్థానాలను దేశంలో విలీనం చేయించిన ఘనత సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌దేనని కొనియాడారు. ఆంగ్లేయులు దేశం విడిచి వేళ్లే ముందు సంస్థానాలను వారి ఇష్టానికి వదిలి వెళ్లారని … సంస్థానాలను పటేల్‌ విలీనం చేయించారన్నారు. వల్లభాయ్‌ లేకపోతే జునాగఢ్‌, హైదరాబాద్‌ సంస్థానాలు ఏమయ్యేయో అని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు నిజాం పాలనలో మహిళలు అనే ఇబ్బందులు పడ్డారన్నారు. పాకిస్థాన్‌లో చేరితే ఏం చేస్తారని జోధపూర్‌ మహారాజ్‌ జిన్నాతో చర్చలు జరిపారన్నారు. జిన్నా ఖాళీకాగితంపై సంతకం చేసి షరతులు రాసుకోమన్నారని అద్వానీ వెల్లడించారు.