మనం సహజ మిత్రులం : ఒబామా

Obama-speech-at-Siri-Fort-Aమూడు రోజుల పర్యటనలో భాగంగా భారత్ విచ్చేసిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పర్యటన నేటితో ముగియనుంది. చివరి రోజైన ఈరోజు (మంగళవారం) ఒబామా దిల్లీలోని సిరిఫోర్టు స్టేడియంలో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. యువత, సామాజిక కార్యకర్తల నుద్దేశించి ఒబామా కీలకోపన్యాసం చేశారు. భారత్, అమెరికా ప్రజలు సహజ మిత్రులని ఆయన అన్నారు. నోబెల్ శాంతి పురస్కార గ్రహీత కైలాష్ సత్యార్థితో పాటు దాదాపు రెండువేల మంది హాజరయ్యారు. కార్యక్రమంలో మిషెల్ ఒబామా కూడా పాల్గొన్నారు.

ఒబామా ప్రసంగంలోని ముఖ్యాంశాలు :

* భారత్, అమెరికా ప్రజలు సహజ మిత్రులు
* సామాజిక మాధ్యమాలతో మన బంధం మరింత బలపడింది
* చంద్రుడు, అంగారకుడిని చేరిన కొన్ని దేశాల్లో భారత్, అమెరికా ఉన్నాయి
* ఇరు దేశాల అభ్యున్నతి కోసం స్నేహహస్తం అందిస్తున్నాం
* భారత్‌లో ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతా పొందేలా అమెరికా సహకరిస్తుంది
* భారత్‌లో రైతుల ఆదాయం పెంచేందుకు సహకరిస్తాం
* భారత్‌లో మౌలిక వసతుల అభివృద్ధికి సహకరించేవారిలో తాము ముందుంటాం
* భారత సంస్కృతి, ప్రజారోగ్య పరిరక్షణలో భాగస్వాములమవుదాం
* అణ్వస్త్ర రహిత ప్రపంచం కోసం అమెరికా కృషి చేస్తోంది
* మయన్మార్ శ్రీలంక, దక్షిణాసియా దేశాలకు భారత్ సహకరించాలి
* ఐరాస భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వానికి పూర్తి మద్దతు
* కాలుష్య రహిత ఇంధన ఉత్పత్తికి భారత్ చేస్తున్న కృషి అభినందిస్తున్నాం
* భారత్‌ లో కుటుంబాలను ఐక్యంగా ఉంచడంలో మహిళలదే ప్రధానపాత్ర
* మహిళల సమానత్వం కోసం అమెరికా కృషి చేస్తోంది
* మహిళా సాధికారత సాకారమైనప్పుడు ఏదేశమైనా అభివృద్ధి చెందుతుంది
* నా రంగు చూసి కించపరిచే విధంగా వ్యవహరించిన ఘటనలను చూశా
* ప్రపంచంలో ఎన్నో అసమానతలు ఉన్నాయి అంటూ ఒబామా ఉద్వేగ భరిత ఉపన్యాసం
* టీ అమ్ముకున్న వ్యక్తి ప్రధాని పదవిని అధిష్టించటం భారత్‌లో సాధ్యమైంది.
* ఇలాంటి ప్రపంచంలో ఉన్నందుకు గర్వపడుతున్నా
* భారత గణతంత్ర వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న తొలి అమెరికా అధ్యక్షుడిగా గర్వపడుతున్నా
* 2010లో భారత్ వచ్చినప్పడు దీపావళి వేడుకల్లో పాల్గొని బాంగ్రా నృత్యం చేశాను
* ‘నాకన్నా… మిషెల్ బాగా నృత్యం చేసింది
* ఈసారి అలాంటి అవకాశం రాలేదు
* భారత భవిష్యత్తు యువత చేతిలోనే ఉంది
* యువత భారత్‌కే కాదు… ప్రపంచానికే దశ దిశ చూపగలదు
* భారత్, అమెరికా ప్రజల్లో కష్టపడే తత్వం ఎక్కువ
* అమెరికా యువత భారత్‌లో చదువుకునేందుకు పోత్రహిస్తాం
* మతం ఆధారంగా మనుషులను విడదీయలేరని భారత్ నిరూపించింది
* గాంధీజీ సిద్ధాంతాలు ఇప్పటికీ ఆచరణీయమే
* ప్రతి మహిళ స్వేచ్ఛ, గౌరవాన్ని పొందగలగాలి
* రెండు సార్లు భారత్ వచ్చిన చివరి అధ్యక్షుడు కాకూడదని కోరుకుంటున్నాను
* జైహింద్ నినాదంతో ఒబామా తన ప్రసంగాన్ని ముగించారు