సినిమా వినోదం అందరికి అందుబాటులో ఉండాలి : మంత్రి పేర్ని నాని

ఆంధ్రప్రదేశ్‌లో ఆన్‌లైన్‌ సినిమా టికెట్ల విక్రయాల కోసం సినిమాటోగ్రఫీ చట్టానికి సవరణ బిల్లును రాష్ట్ర మంత్రి పేర్ని నాని శాసనసభలో ప్రవేశపెట్టారు.

సినిమా థియేటర్లలో రోజుకు నాలుగు ఆటలు మాత్రమే వేయాల్సిన చోట ఇష్టారాజ్యంగా ఆరేడు వేస్తున్నారు. బెనిఫిట్ షోల పేరిట టికెట్‌కు రూ.500 – రూ.1000 వరకు వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం సినిమా హాళ్లలో జరుగుతున్న వ్యవహారాలకు ఆన్‌లైన్‌ టికెట్ ప్రక్రియ ద్వారా అడ్డుకట్ట వేయొచ్చు. ఇకపై ప్రభుత్వం చెప్పిన సమయాల్లో మాత్రమే సినిమాను ప్రదర్శించాలి. ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడే టికెట్ ధరలు నిర్ణయించాల్సి ఉంటుంది. బస్సు, రైలు టికెట్లు, విమాన టికెట్ల తరహాలోనే ఇంటి వద్ద నుంచే సినిమా టికెట్లనూ ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయొచ్చు అని మంత్రి పేర్ని నాని చెప్పుకొచ్చారు.