రైతులకి గుడ్ న్యూస్, ఇలా చేస్తే నెలకి రూ. 3000 లు మీవే !

ప్రధాని మోడీ రైతులకోసం ఇప్పటికే ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. రైతుల భవిష్యత్తు కోసం పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన అనే కొత్త పథకం తీసుకొచ్చారు. ఈ పథకంలో రైతులకి నెలకి 3000 పెన్షన్ వస్తుంది. అయితే ఈ పథకంలో చేరాలంటే రైతు వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య వారై ఉండాలి. ఈ పథకంలో చేరిన రైతు నెలకు 55 రూపాయలనుండి 200 రూపాయల వరకు వారి వయసుని బట్టి కట్టాల్సి ఉంటుంది, రైతు వయసు 60 సంవత్సరాలు నిండిన తరువాత నెలకి 3000 పెన్షన్ లభిస్తుంది, ఒక వేళ ఆ రైతు ప్రమాదవశాతూ మరణిస్తే నామినీ కి 1500 పెన్షన్ లభిస్తుంది. అయితే రైతుకి 5 ఎకరాలకంటే తక్కువ ఉంటేనే ఈ పథకంలో చేరడానికి అర్హులు.

ఈ పథకంలో ఎలా చేరాలంటే : రైతు ఆధార్ కార్డు, పొలం పట్టాదారు పాసు పుస్తకం, రెండు పాస్ పోర్ట్ సైజు ఫోటోలు తీసుకొని ఏదైనా సర్వీస్ సెంటర్ కి తీసుకెళ్తే అక్కడి సిబ్బంది అప్లై చేస్తారు.

ఎంత వయసుకి ఎంత చెల్లించాలో ఈ క్రింది పట్టికలో చూసుకోవచ్చు :

మరిన్ని వివరాలకోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి