సర్జికల్‌ స్ట్రయిక్స్‌: కేసీఆర్‌కు రాజ్‌నాథ్‌సింగ్‌ ఫోన్‌

kcr

భారత సైన్యం పాక్‌లోని ఉగ్రస్థావరాలపై సర్జికల్‌ స్ట్రయిక్స్‌ చేసిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్స్ చేసినట్టు డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ లెఫ్టినెంట్ జనరల్ రణబీర్ ప్రకటించారు .

ఈ క్రమంలో పాకిస్థాన్ భూ భాగంలో ఉన్న 8 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసినట్లు తెలుస్తుంది. ఉగ్రవాద శిబిరాలను టార్గెట్ చేసి 38 మంది ఉగ్రవాదులను హతం చేశాయి. అంతే కాదు ఉగ్రవాద శిబిరాలను కాపాడుతున్న ఇద్దరు పాకిస్థాన్ సైన్యాన్ని కూడా మత్తు బెట్టింది. నియంత్రణ రేఖను ఆనుకుని మూడు కిలోమీటర్ల లోపలికి చొచ్చుకెళ్లిన భారత కమెండోలు సత్తా చాటారు. ఈ దాడులతో యూరీ సెక్టార్‌లోని ఉగ్రవాద శిబిరాలపై దాడిచేసిన ఉగ్రవాద మూకలపై గట్టి ప్రతీకారం తీర్చుకున్నట్లు అయిందనే అభిప్రాయలు వ్యక్తమౌతున్నాయి.

కాగా, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి సమీక్షించడానికి కేంద్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. నియంత్రణ రేఖ వద్ద పరిస్థితిపై చర్చించేందుకు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా సప్రదించింది.ఇందులో బాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌.. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఫోన్‌ చేశారు. పాక్‌ నియంత్రణ రేఖ వద్ద భారత సైన్యం దాడులు… ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితులను కేసీఆర్‌కు వివరించారు. అయితే ఈ వివరాలన్నీ చాలా కాన్ఫిడెన్సియల్ గా వుంచారు.