ఎర్రబెల్లికి ’రెడ్ సిగ్నల్’ !

Errabelli-Dayakar-Raoతెదేపా సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు కారెక్కడం ఖాయమనే ప్రచారం రాజకీయ వర్గాల్లో విస్తృతంగా జరుగుతోంది. ఈ వ్యవహారంపై మంగళవారం నాటకీయ పరిణామాలు చోటు చేసుకొన్న విషయం తెలిసిందే. ఎర్రబెల్లి రహస్యంగా కేసీఆర్ తో సమావేశమయ్యాడని.. ఢీల్ కుదిరిందనే వార్తలు హల్ చల్ చేశాయి. రావు తో పాటుగా మరో నలుగురు పచ్చ పార్టీ ఎమ్మెల్యెలు కారెక్కడం ఖాయమనే వార్తలొచ్చాయి.

తాజా పరిణామాలను బట్టి చూస్తే.. ఎర్రబెల్లికి రెడ్ సిగ్నల్ పడినట్లు తెలుస్తోంది. రావు రాకను వరంగల్ తెరాస నేతలు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. అక్కడితో ఆగకుండా.. వందల మంది పోగై.. కేసీఆర్ ను కలసి మరీ మొరపెట్టుకున్నట్లు సమాచారమ్. ఎర్రబెల్లి రాకవల్ల తెరాసకు ఒరిగేదిమేమీ లేదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. కేసీఆర్ సర్ధిచెప్పడానికి చూసిన కార్యకర్తలు ఎర్రబెల్లిని కారెక్కనిచ్చేది లేదు అన్నట్టుగా కంకణం కట్టుకున్నట్లున్నారట. ఈ నేపథ్యంలో.. ఎర్రబెల్లి కారెక్కడానికి రెడ్ సిగ్నల్ పడినట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరీ.. ఎర్రబెల్లి రెడ్ సిగ్నల్స్ ని క్రాస్ చేసి.. కేసీఆర్ ని కలుస్తారా.. ? లేదా.. ? ఎప్పటిలాగే.. నేను తెదేపాలోనే వుంటానని రొటీన్ స్టేట్ మెంట్ ఇచ్చేసి కామ్ అయిపోతారా.. ? వేచి చూడాలి.