ఊపిరి పీల్చుకున్న సుజనా చౌదరి..

Sujanaకేంద్ర మంత్రి సుజనా చౌదరి ఊపిరి పీల్చుకున్నాడు..మారిషస్ బ్యాంక్ సుజనా ఫై వేసిన పిటిషన్ ఫై నాంపల్లి కోర్టు నాన్బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే..ఈ మేరకు మారిషస్ బ్యాంక్ తనపై పెట్టిన కేసును కొట్టేయాలని కోరుతూ సుజనా చౌదరి సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ కేసుకు సంబంధించి తనకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ నాంపల్లి కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను కూడా కొట్టేయాలని అభ్యర్థించారు. ఈ పిటిషన్పై ఇవాళ విచారణ జరిపిన కోర్టు.. దిగువ కోర్టు ఇచ్చిన వారెంట్ను రద్దు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది.