సానియా మీర్జా ఎక్కడ…..?

saniya-harithaతెలంగాణ అంత పచ్చగా ఉండాలనే ఉద్దేశ్యం తో రాష్ట్ర ప్రభుత్వం హరిత హారం అనే కార్య క్రమాన్ని చేపట్టి , రాష్ట్రం అంత మొక్కలు నాటుతుంటే తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా మాత్రం ఎక్కడ కనిపించడం లేదు. కనీసం సోషల్ మీడియా లో అయినా హరిత హారం గురించి మాట్లాడడం లేదు. దీంతో తెలంగాణ ప్రజలు సానియా మీర్జా పై విమర్శలు చేయడం మొదలు పెట్టారు..

తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా రెండు కోట్లు తీసుకోవడం కాదు సానియ… రెండు మొక్కలైనా నాటాలి. హరితహారం అంటు అన్నిరంగాలకు చెందిన ప్రముఖులు వస్తుంటే… నువ్వు మాత్రం ఎక్కడ కనిపించవు..? ప్రైజ్ మనీ అనగానే పరుగెత్తుకుంటూ వెళ్లి… సెక్రెటెరియట్ లో చెక్ కోసం ఎదురుచూస్తావ్…. అంటూ కామెంట్స్ వేస్తున్నారు. మరి సానియా మీర్జా కు మొక్కలు నాటే తీరిక లేదు కావొచ్చు.