చంద్రబాబు ఇంటిముందు హీరో ఆత్మహత్య?

Shivaji-Babuఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు పై నిప్పులు చెరిగాడు సినీ నటుడు శివాజీ. కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న శివాజీ , ఈరోజు ప్రెస్ మెట్ పెట్టి మరి తన ఆవేశాన్ని చూపించాడు. ప్రత్యేక హోదా కోసం టిడిపి నేతలు ఏమి చేస్తున్నారని ప్రశ్నించాడు. అంతే కాదు ప్రత్యేకహోదా విషయంలో రాజీపడితే చంద్రబాబు ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు.

”చంద్ర బాబు గారు మీరు ప్రత్యేకహోదాను వదిలేసి ప్యాకేజీలకు పాల్పడితే డైరెక్ట్ గా మీ ఇంటి ముందే ఆత్మహత్య చేసుకుంటా, తమాషాగా ఉందా? ఏపీ రాష్ట్రం తో ఆడుకుంటారా? 33 వేల ఎకరాలు ఇస్తే మీరంతా కలిసి పంచుకుంటారా ?” అంటూ చంద్రబాబుపై శివాజీ మండిపడ్డారు.