కాబినెట్ సమావేశాల్లో కేసీఆర్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే..

తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం బుధువారం ప్రగతి భవన్ లో జరిగింది. దాదాపు ఐదు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలు ఏంటి అనేది చూస్తే..

* 320 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేసే విధంగా దుమ్ముగూడెంలో గోదావరి నదిపై బ్యారేజి నిర్మించడం.

* కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మిడ్ మానేరు వరకు 3 టిఎంసిల నీటిని తరలించడానికి నిర్మాణాలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.

* కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు నాబార్డ్, పవర్ పైనాన్స్ కార్పొరేషన్ నుంచి 11వేల 500కోట్ల అదనపు అప్పుకి కేబినెట్ ఆమోదం తెలిపింది.

* గ్రామాల్లో పచ్చదనం- పరిశుభ్రత కోసం చేపట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ కార్యక్రమం- పల్లె ప్రగతి పురోగతిపై సమావేశంలో చర్చించారు.