మరో సర్వే కు తెలంగాణ ప్రభుత్వం సిద్దం..

KCR-Meetingతెలంగాణలో మరో సర్వే చేపట్టేందుకు కెసిఆర్ సర్కార్ ప్రణాళిక సిద్దం చేస్తుంది. నిరుపేదలకు రెండు గదుల ఇళ్లను ఎంపిక చేయడం కోసం అధికారులు ఈ సర్వేను చేపట్టబోతున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రాష్ర్ట గృహ నిర్మాణ సంస్థ అధికారులు ఒక నమూనాను తయారు చేశారు. ప్రభుత్వ ఆమోదం లభించగానే, .సర్వే సిద్దం చేస్తారట.

ముఖ్యంగా రేషన్ కార్డు, ఆధార్ సంఖ్యను పక్కగా నమోదు చేయాలని నిర్ణయించారు. కుటుంబసభ్యుల సంఖ్య, ఆధార్, వృత్తి, వార్షిక ఆదాయ వంటి వివరాలను ఇందులో పొందుపరిచారు. అలాగే బ్యాంకు ఖాతా, ఫోన్ నెంబర్లు కూడా దరఖాస్తుదారులు ఇవ్వాల్సి వుంటుంది. పూర్తి సమాచారం తర్వాత అధికారులు వాటిపై సంతకాలు చేయనున్నారు.

ప్రస్తుతం వుంటున్న ఇంటి వివరాలు, గతంలో ఏమైనా పథకంలో ఇల్లు మంజూరు అయ్యిందా వంటి వివరాలనూ సేకరించనున్నారు. పేదలకు 125 గజాల స్థలంలో మూడులక్షల వ్యయంతో ఇంటిని నిర్మిస్తామని టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రస్తావించిన విషయం తెల్సిందే.