శంకర్రావు అరెస్టుకు కారణం అదేనా ?

The reason behind sankar rao arrestగ్రీన్‌ ఫీల్డ్‌ భూములను కబ్జా చేశారన్న ఆరోపణలపై అరెస్ట్‌ వారెంట్‌ జారీ అయిన శంకర్రావును ఇటీవల విచారణకు పోలీసులు తీసుకెళ్ళిన వ్యవహారం వివాదాస్పదమవడం తెలిసిందే! కాగా ఇప్పుడు తాజాగా మాజీ మంత్రి శంకర్రావు కేసులో కొత్త కోణం వెలుగులోకి వస్తుంది. ఇటీవల శంకర్రావు హోంశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీకి డీజీపీ దినేష్‌రెడ్డి, ఆయన భార్య ఆస్తుల వివరాలు కోరుతూ దరఖాస్తు పెట్టారు. దీనిపై హోంశాఖ డీజీపీకి స్పందించింది. శంకర్రావు అరెస్ట్‌ హైడ్రామా డీజీపీకి ఈ విషయం తెలిసిన మరునాడే కొనసాగిందని శంకర్రావు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్టు సమాచారం. ఆయన కుటుంబ సభ్యులు శంకర్రావు కేసును విచారిస్తున్న సీఐడీకి ఈ విషయాలను చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.

మరోవైపు ఈ సంఘటనల నేపథ్యంలోనే అనారోగ్యానికి గురై హాస్పీటల్‌ లో చికిత్స పొందుతున్న శంకర్రావుకు పరామర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. మాజీ మంత్రి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్రావును తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులను అడిగి శంకర్రావు ఆరోగ్య పరిస్థితి గురించి కవిత తెలుసుకున్నారు. శంకర్రావు అనారోగ్యానికి గురై కేర్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. పోలీసులు చట్టవిరుద్ధంగా, అక్రమంగా అరెస్టు చేసిన శంకర్రావుకు డీజీపీ క్షమాపణలు చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలైనా సరే… ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే ఒక రకంగా, వ్యతిరేకంగా ఉంటే మరో రకంగా వ్యవహరిస్తుందని ఆమె విమర్శించారు. దీనిపై ప్రభుత్వం వెంటనే వివరణ ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు.