మరో ముగ్గురికి వార్నింగ్.. ?

kcr-babu
తెలంగాణ రాష్ట్రంలో తొలి వికెట్ పడింది. అవినీతి ఆరోపణలు రావడంతో.. ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి. రాజయ్యకు కేసీఆర్ చెక్ పెట్టిన విషయం తెలిసిందే. అవినీతి విషయంలో ఏ మాత్రం సహించే ప్రసక్తి లేదు. నిర్ణయాలు ప్రజా ప్రయోజనాలు ప్రాతిపదికగా మాత్రమే అమలు చేయాలని కేసీఆర్ మంత్రులను గట్టిగా హెచ్చరించినట్లు తెలుస్తోంది.

రాజయ్య దారిలో వెళ్లడానికి.. మరో ముగ్గురు మంత్రులు రెడీగా వున్నట్లు సమాచారమ్. ప్రస్తుతానికైతే.. వారికి వార్నింగ్ తో సరిపెట్టినట్లు తెలుస్తోంది. ఆ ముగ్గురు మంత్రులు ఎవరన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. మరోవైపు, కేసీఆర్ సుతిమెత్తగా వార్నింగ్ ఇచ్చిన ఆ ముగ్గురు కూడా.. ఔట్ కు అత్యంత దగ్గర వున్నారని గుసగుసలాడుతున్నారు గులాభి శ్రేణులు.

మొత్తానికి.. రాజయ్యతో రాజుకున్న అవినీతి మంట.. టీ-మంత్రులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. దీనికి తోడు.. రహస్య నివేదికలంటూ.. కేసీఆర్ మంత్రులను మరింత ఆత్మరక్షణలోకి నెట్టేశారు. కేసీఆర్ చెబుతున్న అవినీతి రహిత పాలనలో మునుముందు ఇంకెంత మంది మంత్రుల పీఠాలు కూలుతాయో వేచి చూడాలి..