పాఠశాలల్లో ప్రత్యక్ష బోధనకు హైకోర్ట్ మెలిక !

తెలంగాణాలో ఈ రోజు నుండి పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన అమలు కాబోతున్న సమయంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యక్ష బోధనపై విద్యార్థులను బలవంతం చేయొద్దని సూచించింది. తరగతులకు హాజరుకాని విద్యార్థులపై చర్యలు తీసుకోవద్దని తెలిపింది. ప్రత్యక్ష తరగతులు నిర్వహించని విద్యాసంస్థలపై చర్యలకు ఉపక్రమించవద్దని తెలియచేసింది.

ఆన్‌లైన్, ప్రత్యక్ష బోధనపై విద్యాసంస్థలే నిర్ణయించుకోవచ్చుని పేర్కొంది. ప్రత్యక్ష బోధన నిర్వహించే పాఠశాలలకు మార్గదర్శకాలు జారీచేయాలని ప్రభుత్వానికి సూచించింది. వారంలోగా విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేయాలని ఆదేశించింది.పాఠశాలలు పాటించాల్సిన మార్గదర్శకాలపై ప్రచారం చేయాలని తెలిపింది. గురుకులాలు, విద్యాసంస్థల్లో వసతిగృహాలు తెరవద్దని, గురుకులాలు, హాస్టళ్లలో వసతులపై నివేదిక ఇవ్వాలని, ప్రత్యక్ష బోధనపై పరస్పర విరుద్ధ లాభనష్టాలు ఉన్నాయి అని హైకోర్టు వ్యాఖ్యనించింది. రాష్ట్రంలో కొవిడ్ తీవ్రత ఇంకా కొనసాగుతోందని హైకోర్టు తెలిపింది.