విజయమ్మను అదుపులోకి తీసుకున్నారు!

vijayammaఖమ్మం జిల్లా పర్యటనలో విజయమ్మకు అడుగడుగునా అడ్డంకులే ఎదరువుతున్నాయి. నల్గొండ జిల్లా హుజూర్ నగర్ లో కాంగ్రెస్ కార్యకర్తలు, వైకాపా వాహనాలపై దాడి చేశారు. దీంతో.. అక్కడ కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో.. జిల్లాలో విజయమ్మ పర్యటన మరింత ఉద్రిక్తతలకు దారితీసే ప్రమాదం వుందని భావించి పోలీసులు ఆమె అడ్డుకున్నట్లు తెలుస్తోంది. విజయమ్మను పోలీసులు.. పైనంపల్లి దగ్గర అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌ తరలించే ప్రయత్నం చేస్తున్నారు.