విజయవాడ ఎయిర్‌పోర్ట్‌ ఫర్‌ సేల్‌..

ఏపీ ఫై కేంద్రం కక్ష్య కట్టిందా..వరుస పెట్టి ప్రభుత్వ సంస్థల్ని ప్రవేటీకరణ చేస్తుందా..అంటే అవుననే చెప్పాలి. ఇప్పటికే విశాఖ స్టీల్ ను ప్రవేటీకరణ చేసిన కేంద్రం..ఇప్పుడు విజయవాడ ఎయిర్పోర్ట్ ను సైతం ప్రైవేట్‌ సంస్థలకు కట్టబెడుతుంది.రూ.6వేల కోట్ల స్థిర చరాస్తులు ఉన్న ఎయిర్ పోర్ట్ ను కేవలం ఆరు వందలకే ప్రవైట్ సంస్థలకు అప్పజెప్పబోతుంది.

2024 నాటికి ప్రైవేటీకరణ బాట పట్టించే ప్రైవేటుకు విమానాశ్రయాల్లో రెండోదిగా విజయవాడ ఎయిర్‌పోర్ట్‌ పేరును జాబితాలో చేర్చారు. దేశీయంగానూ, అంతర్జాతీయంగానూ ఎంతో వృద్ధిని సాధించటానికి అవకాశం ఉన్న విజయవాడ ఎయిర్‌పోర్టును కార్పొరేట్‌ సంస్థల కోసం కారుచౌకగా తెగనమ్మే ప్రతిపాదన తీసుకురావటం విమర్శలకు దారి తీస్తోంది. కాగా, కేంద్ర ప్రకటనపై ఎయిర్‌పోర్ట్‌ ఉద్యోగులు భగ్గుమంటున్నారు. కేంద్ర నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవాలని, తమ పోరాటానికి మద్దతుగా నిలవాలని కోరుతున్నారు.