కార్పోరేట్ ఫిరాయింపులు..!

yenamala-ramakrishnuduరాష్ర్టంలో ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నది వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సంబంధాలున్న కార్పోరేట్ సంస్థల యాజమాన్యాలు, ప్రతినిధులే… అని తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. వైఎస్ హయాంలో లబ్దిపొందిన కంపెనీల యజమానులే డబ్బు వెదజల్లి ప్రజాప్రతినిధులను కొంటున్నారని, దీనికి సంబంధించి చంచల్ గూడ జైలులో జగన్ వ్యూహారచన జరుపుతుంటే…వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళకు దానిని అమలు చేసేందుకు వైఎస్ హయాంలో లబ్దిపొందిన యాజమాన్యాలు సహకరిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. టిడిపి అధికారంలోకి వస్తే అవినీతి సొమ్మును పేదలకు పంచుతామనే భయంతో కార్పోరేట్ కంపెనీల యజమానులు జగన్కు సహకరిస్తున్నారన్నారు.

మరోవైపు తెదేపా ఉపాధ్యక్షుడు పెద్దిరెడ్డి మాట్లాడుతూ… జగన్ పార్టీకి బహిరంగంగా అనుకూలంగా మాట్లాడుతున్నా సబ్బం హరిపై కాంగ్రెస్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. వైకాపా సహకార ఎన్నికల్లో అసలు పోటీ ఇచ్చేంత స్థితిలో కూడా లేదని విమర్శించారు. వైకాపా నేత మైసూరా రెడ్డికి అవిశ్వాసానికి, విశ్వాసానికి తేడా తెలియకపోవడం సిగ్గు చేటని పెద్దిరెడ్డి అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టాలని వైకాపా భావిస్తే టిడిపికి మద్దతిచ్చే ఎమ్మెల్యేలతో కూడిన లేఖను గవర్నర్కు ఇవ్వాలని సవాల్ విసిరారు.