1300 మంది ఉద్యోగుల్ని తీసివేయనున్న ‘జూమ్’


ప్రముఖ వీడియో కనెక్ట్ టెక్నాల‌జీ సంస్థ జూమ్ సుమారు 1300 మంది ఉద్యోగుల్ని తొల‌గించ‌నుంది. త‌మ కంపెనీలో ఉన్న ఉద్యోగుల్లో 15 శాతం మందిని తొల‌గించ‌నున్నట్లు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎరిక్ యువాన్ తెలిపారు. కంపెనీ అధికారిక బ్లాగ్‌లో ఈ విష‌యాన్ని ప్రక‌టించారు. అమెరికాలో ఉన్న ఉద్యోగుల‌కు ఈమెయిల్ ద్వారా స‌మాచారాన్ని చేర‌వేయ‌నున్న‌ట్లు యువాన్ చెప్పారు. అర‌గంటో ఇంపాక్టడ్ అని మెయిల్ వ‌స్తుంద‌ని అన్నారు. ఇక అమెరికా బ‌య‌ట ఉన్న ఉద్యోగుల‌కు స్థానిక విధానాల‌ను బ‌ట్టి స‌మాచారం చేర‌వేయ‌నున్నట్లు తెలిపారు. అమెరికాలో ఉద్యోగం కోల్పోనున్న జూమీల‌కు 16 నెల‌ల జీతం ఇవ్వ‌నున్న‌ట్లు సీఈవో యువాన్ చెప్పారు. హెల్త్‌కేర్ క‌వ‌రేజ్ కూడా ఉంటుంది. 2023 సంవ‌త్స‌రానికి చెందిన బోన‌స్ కూడా ఉంటుంద‌ని వెల్ల‌డించారు. స్థానిక చ‌ట్టాల‌ను బ‌ట్టి ఇత‌ర దేశాల్లో ఉద్యోగుల కొన‌సాగింపు ప్రక్రియ జ‌రుగుతుంద‌న్నారు.