రివ్యూ : ఆడవాళ్లు మీకు జోహార్లు – రొటీన్ ఫ్యామిలీ డ్రామా

నటీనటులు : శర్వానంద్‌, రష్మిక మందన్న, ఖుష్బూ, రాధిక తదితరులు
డైరెక్టర్ : కిషోర్ తిరుమల
మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ
నిర్మాత : సుధాకర్‌ చెరుకూరి
తెలుగుమిర్చి రేటింగ్ : 2.75/5
విడుదల తేదీ : మార్చి 4 , 2022

శర్వానంద్‌, రష్మిక మందన్న జంటగా నటించిన తాజా చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. ఫామిలీ డైరెక్టర్ కిశోర్​ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్​ బ్యానర్​పై సుధాకర్​ చెరుకూరి నిర్మించారు. మంచి అంచనాల మధ్య ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.

కథ :

చిరంజీవి (శర్వానంద్) అమ్మ , పిన్నులు మధ్య గారాబంగా పెరిగిన అబ్బాయి. పెళ్లి వయసు రావడం తో చిరంజీవి కి పెళ్లి చేయాలనీ కుటుంబ సభ్యులు అమ్మాయిలను వెతకడం మొదలుపెడతారు. చిరంజీవి కి నచ్చిన అమ్మాయిలు ఇంట్లో ఆడవారికి నచ్చకపోవడం తో చిరంజీవి కి పెళ్లి కాదేమో అనే భయం పట్టుకుంటుంది. ఈ క్రమంలో ఆద్య (రష్మిక ) ను చూసి ఇష్టపడతాడు. చిరంజీవి – ఆద్య ఇద్దరు త్వరగానే ప్రేమలో పడతారు. ఆద్య..చిరంజీవి ఇంట్లో కూడా నచ్చడం తో వీరిద్దరికి పెళ్లి చేయాలనీ అనుకుంటారు. కానీ ఆద్య వాళ్ల అమ్మ వకుళ (కుష్బూ) కు పెళ్లి చేయడం ఇష్టం ఉండదు. దీనికి కారణం ఏంటి..? అవి తెలుసుకొని చిరంజీవి ఏంచేసాడు..? చివరికి ఆద్య తల్లి పెళ్లి కి ఒప్పుకుంటుందా..? లేదా..? అనేది సినిమా చూస్తే తెలుస్తుంది.

ప్లస్ :

  • శర్వానంద్ – రష్మిక ల కెమిస్ట్రీ
  • కథ
  • ఫస్ట్ హాఫ్

మైనస్ :

  • సెకండ్ హాఫ్
  • క్లైమాక్స్
  • స్క్రీన్ ప్లే

నటీనటుల తీరు :

  • శ‌ర్వానంద్ రీసెంట్‌గా చేసిన సినిమాల్లో, ఈ సినిమాను కాస్త డిఫ‌రెంట్‌గా చేసిన‌ట్టే అనిపించింది. మరోసారి ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకోవడం లో సక్సెస్ అయ్యాడు. రష్మిక – శర్వాల మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకున్నాయి .
  • రష్మిక ఎప్పటిలాగానే గ్లామర్ గానే కాక నటనతోను ఆకట్టుకుంది
  • ఇక రాధిక‌, ఖుష్బూ, ఊర్వ‌శి, బెన‌ర్జీ తదిత‌రులు వారి వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు.
  • వెన్నెల కిషోర్ మరోసారి ప్రేక్షకులను విపరీతంగా నవ్వించాడు

సాంకేతిక వర్గం :

  • దేవి శ్రీ మ్యూజిక్ లో టైటిల్ సాంగ్ తప్ప మిగతావేవీ కూడా పెద్ద ఏమి బాగాలేవు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా పర్వాలేదు అనిపించింది
  • ఎ. శ్రీకర్‌ ప్రసాద్‌ ఎడిటింగ్ ఇంకాస్త స్పీడ్ చేస్తే బాగుండు
  • సుజిత్ కెమెరా వ‌ర్క్ బావుంది. స‌న్నివేశాలు ఓ ఫ్రెష్ నెస్ క‌నిపిస్తుంది
  • నిర్మాణ విలువలు కథకు తగ్గట్లు ఉన్నాయి
  • ఇక డైరెక్టర్ కిషోర్ విషయానికి వస్తే.. ప్రేమ‌లు, బంధాలు, బాంధ‌వ్యాలు మీద‌నే కతలు రాస్తుంటాడు. ఈ సినిమా కథ కూడా అలాగే ఉంటుంది. కాకపోతే కొత్తదనం లేకపోవడం, సినిమాలో ట్విస్ట్ లు ఏమిలేకపోవడం తో చూసిన సినిమానే కథ అన్నట్లు అనిపిస్తుంది.

ఫస్ట్ హాఫ్ సాగినంత స్పీడ్ గా సెకండ్ హాఫ్ లేదు..బోరింగ్ సన్నివేశాలు ..సెంటిమెంట్ కూడా అంతగా వర్క్ అవుట్ కాలేదు. క్లైమాక్స్ ఇక ప్రేక్ష‌కుడికి క‌నెక్ట్ కావాలి. కానీ తిరుమ‌ల కిషోర్ ఆ విష‌యంలో ఆశించిన స్థాయిలో తెర‌కెక్కించ‌లేద‌నే భావ‌న క‌లిగింది.

ఓవరాల్ గా..ఎలాంటి అంచనాలు లేకుండా సినిమా చూస్తే నచ్చుతుంది.