రివ్యూ : చెక్ – మైండ్ గేమ్‌తో సాగే సస్పెన్స్ థ్రిల్లర్

న‌టీన‌టులు: నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్ త‌దిత‌రులు
దర్శకత్వం : చంద్ర శేఖర్ యేలేటి
నిర్మాతలు: భవ్య క్రియేషన్స్
మ్యూజిక్ : కళ్యాణ్ మాలిక్
విడుదల తేది : ఫిబ్రవరి 26, 2021
తెలుగు మిర్చి రేటింగ్ : 3/5

భీష్మ మూవీ తో సూపర్ హిట్ అందుకున్న నితిన్..శుక్రవారం చెక్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ లో ఉరిశిక్ష పడిన ఖైదీ గా నితిన్ కనిపిస్తుండగా..అతడి తరుపు లాయర్ గా రకుల్ కనిపిస్తుంది. మరి ఈ మూవీ కథ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.

కథ :

ఆదిత్య (నితిన్) తాను చేయని నేరానికి ఉరిశిక్ష పడుతుంది. గద్వాల జైలులో శిక్ష అనుభవిస్తున్న సమయంలో శివన్నారాయణ (సాయి చంద్) అనే మరో ఖైదీ తో పరిచయం ఏర్పడుతుంది. చెస్ ప్లేయర్ అయినా శివన్నారాయణ..ఆదిత్య ను చెస్ ప్లేయర్ చేస్తాడు.అయితే ఆదిత్య కోసం లాయర్ మానస (రకుల్ ప్రీత్ సింగ్) రంగంలోకి దిగుతుంది. ఈ క్రమంలో తన ప్రేయసి యాత్ర (ప్రియా ప్రకాశ్ వారియర్ ) కారణంగా టెర్రిరిస్టుగా ముద్ర పడ్డారనే విషయాన్ని తెలుసుకుంటుంది. యాత్ర ప్రేమ వల్ల ఆదిత్యపై టెర్రిరిస్టు ముద్ర ఎందుకు పడింది..? ఆదిత్యను యాత్ర ఎందుకు మోసం చేసి వెళ్లింది..? ఆదిత్య నిర్ధోషి అని మానస ప్రూవ్ చేసిందా..లేదా ? జైలులో ఖైదీగా ఉన్న ఆదిత్య అంతర్జాతీయ స్థాయిలో ఆదిత్య చెస్ గ్రాండ్ మాస్టర్‌గా ఎలా మారతాడు..? ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు సినిమా చూడాలసిందే.

ప్లస్ :

  • చంద్రశేఖర్ స్క్రీన్ ప్లే
  • కథ – కథనం
  • నితిన్ యాక్టింగ్
  • బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

మైనస్ :

  • కొన్ని సన్నివేశాలు స్లో గా సాగడం
  • క్లైమాక్స్

నటీనటుల తీరు :

  • భీష్మ తో సూపర్ హిట్ అందుకున్న నితిన్..చెక్ లో ఉరిశిక్ష పడిన ఖైదీగా , చెస్ ప్లేయర్ గా , ప్రేమికుడిగా ఇలా మూడు విభిన్న క్యారెక్టర్లలో అద్భుతంగా చేసాడు. కీలక సన్నివేశాల్లో నితిన్‌లో మెచ్యురిటీ కనిపిస్తుంది. ఓవరాల్‌గా ఆదిత్య పాత్రలో నితిన్ 100 శాతం న్యాయం చేసాడు.
  • యాత్ర గా ప్రియా ప్రకాష్ వారియర్ పాత్ర తక్కువే అయినప్పటికీ కథ అంత ఆమె చుట్టే తిరుగుతుంది. ఉన్నంత సేపు తన యాక్టింగ్ తో , గ్లామర్ తో కట్టిపడేసింది.
  • మానస పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ తన గత చిత్రాల్లోని పాత్రలకంటే భిన్నంగా కనిపిస్తుంది. లాయర్ పాత్రలో హావభావాలు మంచిగా పండిచింది. గ్లామర్ ఆస్కారం లేకున్నా గానీ.. లుక్స్ పరంగా మంచి మార్కులు కొట్టేసింది.
  • ఇతర పాత్రల విషయానికి వస్తే..సాయిచంద్ పాత్ర సినిమాకు హైలైట్ గా నిలిచింది. తనదైన నటనతో మరోసారి ప్రేక్షకులను తనవైపు తిప్పుకొనే పాత్రలో మెప్పించారు. అలాగే మురళీ శర్మ పాత్ర కూడా సాఫ్ట్‌గా ఫీల్‌గుడ్‌గా కనిపిస్తుంది. ఇక నెగిటివ్ కోణంతో సాగే సంపత్ రాజ్ పాత్ర కూడా సెకండాఫ్‌లో కీలకంగా మారింది. హర్షవర్ధన్, పోసాని పాత్రలు కామెడీని పండించాయి.

సాంకేతిక వర్గం :

  • కళ్యాణ్ మాలిక్ మరోసారి తన నేపధ్య సంగీతం తో ఆకట్టుకున్నాడు. కథ కు తగ్గ మ్యూజిక్ అందజేసి ప్రేక్షకులను కట్టిపడేసాడు.
  • రాహుల్ శ్రీవాస్తవ్ అందించిన సినిమాటోగ్రఫిని సినిమా హైలైట్ లలో ఒకటిగా నిలిచింది. కత్తి మీద సాము లాంటి జైల్ ఎపిసోడ్‌ను అద్భుతంగా తెరకెక్కించారు. జైలుగదిలో తీసిన ఫైట్ చాలా బాగుంటుంది. ఎడిటింగ్, ఆర్ట్ విభాగాల పనితీరు బాగుంది.
  • భవ్య క్రియేషన్స్ వారు కథకు తగ్గ ఖర్చు పెట్టి సినిమాను బాగా తీశారు.
  • ఇక డైరెక్టర్ చంద్ర విషయానికి వస్తే ..ఈయన నుండి సినిమా వస్తుందంటే అది ఖచ్చితంగా కొత్తదనం ఉంటుందని ఫిక్స్ అవ్వొచ్చు. ప్రతి సన్నివేశం ఆకట్టుకునేలా నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే ఆసక్తి ఉండేలా తెరకెక్కిస్తారు. ఈ సినిమా విషయంలోనే అదే పంధాలో నడిపించాడు. జైలులో సీన్లను అత్యంత పకడ్బందీగా ముందుకు తీసుకెళ్లారు. జైలులో ఖైదీల ప్రవర్తన, వాతావరణాన్ని చక్కగా చూపించారు. ఇక మురళీ శర్మ లాంటి సాఫ్ట్ జైలర్, సంపత్ రాజ్ లాంటి మొండి అధికారి పాత్రలతో సినిమాను బ్యాలెన్స్ చేశాడు. నితిన్ పాత్రకు సంబంధించిన వరకు కథను ఆద్యంత ఆసక్తిని కలిగించేలా రూపొందించారు. అక్కడక్కడా మాత్రం కొన్ని సన్నివేశాలు బాగా సాగదీసినట్లు కనిపించాయి. కానీ క్లైమాక్స్ విషయంలో మాత్రం తన మార్కును చూపించలేకపోయారు.

ఫైనల్ గా ..మైండ్ గేమ్‌తో సాగే సస్పెన్స్ థ్రిల్లర్ “చెక్”.