రివ్యూ : డియర్ కామ్రేడ్ – స్లో అయ్యాడు

స్టార్ కాస్ట్ : విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్నా తదితరులు..
దర్శకత్వం : భ‌ర‌త్ క‌మ్మ‌
నిర్మాతలు: మైత్రి మూవీ మేకర్స్
మ్యూజిక్ : జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్‌
విడుదల తేది : జులై 26, 2019
తెలుగు మిర్చి రేటింగ్ : 3.25/5

రివ్యూ : డియర్ కామ్రేడ్ – స్లో అయ్యాడు

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ..రష్మిక జంటగా నటించిన తాజా చిత్రం డియర్ కామ్రేడ్ . భరత్ కమ్మ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ ఈరోజు (జులై 26) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సౌత్ నాల్గు భాషల్లో ఒకేసారి విడుదల కాబోతుండడం తో ఈ చిత్ర ఓపెనింగ్స్ ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

కన్నడ సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్ ఈ చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. మైత్రీ మూవీమేక‌ర్స్, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాల‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, మోహ‌న్ చెరుకూరి(సి.వి.ఎం), య‌శ్ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మించారు.

గీత గోవిందం తర్వాత విజయ్ , రష్మిక జంటగా నటించడం..సినిమా ప్రమోషన్స్ ఓ రేంజ్ లో చేయడం తో సినిమా ఎలా ఉందొ చూడాలని..సినిమా టాక్ ఎలా వచ్చిందో తెలుసుకోవాలని అభిమానులు , సినీ ప్రేక్షకులు , చిత్ర వర్గాలు ఎంతో ఆతృతగా ఉన్నారు. మరి వారి ఆత్రుత కు కామ్రేడ్ ఏ సమాధానం చెప్పాడు..? అసలు కామ్రేడ్ కథ ఏంటి..? కామ్రేడ్ గా విజయ్ న్యాయం చేశాడా..లేదా..? అనేది ఇప్పుడు చూద్దాం.

కథ :

చైత‌న్య అలియాస్ బాబీ (విజ‌య్ దేవ‌ర‌కొండ‌) కాలేజీ స్టూడెంట్స్ కు లీడర్..మొదటి నుండి కూడా దూకుడు స్వభావం. కళ్ల ముందు అన్యాయం జరిగితే ఊరుకునే వాడు కాదు..అలాంటిది ఓ రోజు తన పక్కింట్లోకి వచ్చిన దేవి అలియాస్ లిల్లీ(ర‌ష్మిక మంద‌న్న) చూసి ఇష్టపడతాడు.

స్టేట్ క్రికెట్ ప్లేయ‌ర్‌ అయినా లిల్లీ..మొదట్లో బాబీ ని దూరం పెట్టిన ఆ తర్వాత ఇష్టపడుతుంది. అయితే లిల్లీ కి గొడవలన్న..కొట్లాటలన్నా ఇషటం ఉండదు. బాబీ గొడవలకు వెళ్ళినప్పుడల్లా వద్దు అంటూ చెప్పింది. కానీ బాబీ మాత్రం లిల్లీ మాటలను లెక్కచేయకుండా గొడవలకు వెళ్లే వాడు. ఈ గొడవల కారణంగా బాబీ నుండి దూరంగా వెళ్ళిపోతుంది లిల్లీ. ఆ తర్వాత లిల్లీ కోసం వెతుకుతాడు అయినా కానీ ఆమె జాడ దొరకదు.

దీంతో పిచ్చోడైపోతాడు. సౌండింగ్ థెర‌పీ మీద రీసెర్చ్‌చేస్తూ మూడేళ్లు ఇంటికి దూరంగా ఉంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది..? లిల్లీ ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటుంది..? లిల్లీ – బాబీ కలుస్తారా లేదా…? అనేది సినిమా చూడాల్సిందే.

ప్లస్ :

* విజయ్ – రష్మిక నటన

* ఫస్ట్ హాఫ్

* కాలేజీ సన్నివేశాలు

* జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్

మైనస్ :

* సెకండ్ హాఫ్

* స్లో నేరేషన్

* సినిమా నిడివి

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* విజయ్ యాక్టింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు ..అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీవాలా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో తన యాక్టింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో రుజువు చేసాడు. ఇక ఈ సినిమాలోనూ రెండు విభిన్న పాత్రల్లో కట్టిపడేసాడు. విద్యార్థి నాయకుడిగా, ప్రేమికుడిగా, ప్రేమ దూరమై బాధలో ఉన్న వ్యక్తిగా మంచి నటన కనబరిచాడు.

* ఇక లిల్లీ అనే లేడీ క్రికెట‌ర్ పాత్ర‌లో ర‌ష్మిక చ‌క్క‌గా ఒదిగిపోయింది. ఈ పాత్ర కోసం ఆమె ప‌డ్డ క‌ష్టం తెర‌పై క‌న‌ప‌డుతుంది. స‌మాజంలో ప్ర‌స్తుతం మ‌హిళ‌లు ఎదుర్కొంటున్న స‌మస్య‌ల్లో ఓ స‌మ‌స్యా బాధితురాలిగా ఆమెను పొట్రేట్ చేసింది. రొమాంటిక్‌ సీన్స్‌లో సూపర్బ్ అనిపించిన రష్మిక, ఎమోషనల్ సీన్స్‌లోనూ మెప్పించారు. అక్కడక్కడా డబ్బింగ్ చెప్పటంలో కాస్త ఇబ్బంది పడినట్టుగా అనిపిస్తుంది.

* చారుహాస‌న్‌, క్రికెట్ చీఫ్ సెల‌క్ట‌ర్ పాత్ర‌ధారి, సుహాస్ త‌దిత‌రులు వారి వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు.

సాంకేతిక విభాగం :

* కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ అయినా జిస్టిన్ ప్ర‌భాక‌రన్..మొదటిసారి తెలుగు చిత్రానికి పనిచేసారు. ప్రభాకరన్ అందించిన పాటలన్నీ అద్భుతంగా ఉన్నాయి. మూడు మెలోడీ సాంగ్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సైతం అలరించింది.

* సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫి సినిమాకు మరో ప్లస్‌ పాయింట్‌. కేరళ అందాలతో పాటు నార్త్‌లో తెరకెక్కించిన రోడ్‌ సీన్స్‌ విజువల్స్‌ కూడా మెప్పిస్తాయి.

* శ‌్రీజిత్ సారంగ్‌ ఎడిటింగ్ కు ఇంకాస్త పనిచెపితే బాగుండేది.

* జె కృష్ణ‌ డైలాగ్స్ బాగున్నాయి.

* మైత్రి నిర్మాతల నిర్మాణ విలువలు ఆకట్టుకున్నాయి. నాల్గు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేసి ..దానికి తగ్గట్లే ప్రమోషన్ చేసి సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడం లో విజయం సాధించారు. అంతే కాకుండా సినిమాను భారీ ఎత్తున విడుదల చేసి తెలుగు స్థాయి ని పెంచారు.

* ఇక డైరెక్టర్ భరత్ కమ్మ విషయానికి వస్తే.. వైవిధ్యమైన సినిమాలు తీసే దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన భరత్.. ‘డియర్ కామ్రేడ్’ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచమయ్యారు. కొత్త దర్శకులను ప్రోత్సహించడంతో ముందుండే విజయ్ దేవరకొండకు భరత్ కమ్మ స్నేహితుడు కావడంతో తొలి చిత్రంతోనే విజయ్ దేవరకొండ లాంటి క్రేజీ హీరోతో, మైత్రీ మూవీ మేకర్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థతో కలిసి పనిచేసే అవకాశాన్ని అందిపుచ్చుకన్నారు భరత్ కమ్మ.

‘ఫైట్ ఫర్ వాట్ యు లవ్’ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్‌తో.. ఎమోషనల్ అండ్ రొమాంటిక్ డ్రామాగా డియర్ కామ్రేడ్ కథ అల్లుకున్నారు భరత్ కమ్మ. మ‌నం ఇష్ట‌ప‌డే దాని కోసం పోరాటం చేయాలి అనే ఓ పాయింట్‌ను ఆధారంగా చేసుకుని భ‌ర‌త్ క‌మ్మ ఈ సినిమాను తెర‌కెక్కించాడు. ఈయన అనుకున్న లైన్ బాగున్నప్పటికీ తెరపై దానిని చూపించడంలో కాస్త స్లో అయ్యాడు.

ఫస్ట్ హాఫ్ అంత హీరో – హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్..కాలేజీ సన్నివేశాలు..కామెడీ ఇలా స్పీడ్ గా నడిపించిన భరత్..సెకండ్ హాఫ్ మాత్రం స్లో గా నడిపించి బోర్ కొట్టించాడు. కథనంలోనూ కొత్తదనం లేకపోవటం నిరుత్సాహం కలిగిస్తుంది. ఓవరాల్ గా వన్ టైం వాచ్ మూవీ అన్నట్లు ఉంది.

తెలుగు మిర్చి రేటింగ్ : 3.25/5

Click here for English Review