రివ్యూ : క్రాక్ – పక్క మాస్ ఎంటర్టైనర్

స్టార్ కాస్ట్ : రవితేజ , శృతి హాసన్ , సముద్రఖని , వరలక్ష్మి శరత్ కుమార్ తదితరులు..
దర్శకత్వం : గోపీచంద్ మలినేని
నిర్మాతలు: ఠాగూర్ మధు
మ్యూజిక్ : థమన్
విడుదల తేది : జనవరి 09 , 2021
తెలుగు మిర్చి రేటింగ్ : 3.5/5

మాస్ మహరాజ్ రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా క్రాక్. కిక్ తో హిట్ అందుకున్న రవితేజ ఈసారి తన క్రాక్ ఏంటన్నది చూపించడానికి థియేటర్స్ లోకి వచ్చాడు. ఆల్రెడీ గోపీచంద్ తో డాన్ శీను, బలుపు సినిమాలతో హిట్ అందుకోగా థర్డ్ మూవీతో హ్యాట్రిక్ కొట్టాలనే కసితో ఈ సినిమా చేసాడు. ఆ కసి కి శృతి హాసన్ గ్లామర్ , థమన్ మ్యూజిక్ , రామ్ లక్ష్మణ్ యాక్షన్ , గోపీచంద్ మలినేని డైరెక్షన్ తోడవడం అన్నింటికీ మించి సంక్రాంతి బరిలో రావడం తో సినిమా ఫై అమాంతం అంచనాలు పెరిగిపోయాయి. మరి ఆ అంచనాలకు తగ్గట్లు సినిమా ఉందా..? వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న రవితేజ ఈ సినిమాతో హిట్ కొట్టాడా..లేదా..? గోపీచంద్ ఎలాంటి కథ ను తీసుకొచ్చాడు అనేది పూర్తి రివ్యూ లో చూద్దాం.  

కథ :

పోత రాజు వీర శంకర్ (రవితేజ) పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్. అలాంటి పోలీస్ ఆఫీసర్ కు ముగ్గురు నేరస్థులు గొడవ పెట్టుకున్నారు. వారిలో ఒంగోలుకు చెందిన కటారి (సముద్రఖని ) అత్యంత శక్తివంతమైనవాడు. ఎంత శక్తివంతుడు అంటే అతను అంటే చుట్టుపక్కల 20 ఊర్లకు భయం. అలాంటి వ్యక్తితో వీరశంకర్‌ వైరానికి దిగుతాడు. తన సహోద్యోగి కొడుకు చావుకు కారణాలు తెలుసుకునే క్రమంలో కటారితో వైరం మరింత పెరుగుతుంది. ఈ క్రమంలో వీరశంకర్‌ని చంపడానికి కటారి స్కెచ్ వేస్తాడు..? మరి కటారి స్కెచ్ నుండి వీరశంకర్ ఎలా తప్పించుకుంటాడు..? అసలు కటారి కి – వీర శంకర్ కు ఎలా వైరం వస్తుంది..? వీర శంకర్ కు జయమ్మ (వరలక్ష్మి శరత్ కుమార్) కు సంబంధం ఏంటి..? అనేది మీరు తెరపై చూడాల్సిందే.

ప్లస్ :

  • రవితేజ
     
  • థమన్ మ్యూజిక్
  • మాస్ ఆడియన్స్ కోరుకునే యాక్షన్
  • ఫస్ట్ హాఫ్

మైనస్ :

  • రొటీన్ స్టోరీ
  • రవితేజ – శృతి హాసన్ ల మధ్య బలమైన సన్నివేశాలు లేకపోవడం

న‌టీన‌టులు నటన :

  • మాస్ రాజా రవితేజ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తనకు కలిసొచ్చే పోలీస్ పాత్ర లో మరోసారి తన విశ్వరూపాన్ని చూపించాడు. యాక్షన్, డాన్స్ లతో అభిమానులకు ఫుల్ భోజనం పెట్టేసాడు.
  • శృతి హాసన్ కేవలం పాటలకు మాత్రమే పరిమితమైంది.
  • జయమ్మ పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నెగిటివ్ పాత్ర లో కనిపించి మెప్పించింది.
  • పవర్ ఫుల్ విలన్ రోల్ లో సముద్రఖని నటించి , రవితేజ తో ఢీ కొట్టాడు
  • మిగతా పాత్రల్లో అలీ ,చిరాగ్ జానీ, దేవి ప్రసాద్ , మౌర్యాని ,సుధాకర్ , వంశీ చాగంటి , కత్తి మహేష్ వారి వారి పరిధిలో బాగానే చేసారు.
  • అంకిత మహారణా ఐటెం సాంగ్ లో అందాల ఆరబోతతో కిక్ ఇచ్చింది.

సాంకేతిక వర్గం :

  • వరుస మ్యూజికల్ హిట్స్ తో సంచలనంగా మారిన థమన్ మరోసారి ఈ మూవీ తో ఆకట్టుకున్నాడు. పాటలు , బ్యాక్ గ్రౌండ్ తో అలరించాడు.
  • రామ్ లక్ష్మణ్ ఫైట్స్ సూపర్బ్ ..
  • నిర్మాత ఠాగూర్ మధు ఎక్కడ కూడా ఖర్చు కు వెనుకడుగు వెయ్యకుండా చాల రిచ్ గా తెరకెక్కించాడు.
  • ఇక డైరెక్టర్ గోపీచంద్ మలినేని విషయానికి వస్తే..ఆల్రెడీ రవితేజ తో బలుపు , డాన్ శ్రీను సినిమాలు చేసి హిట్స్ అందుకున్నాడు. రవితేజ ను ఎలా చూపించాలో ఆయనకు బాగా తెలుసు. అందుకే వీర శంకర్ గా ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ఈ సినిమాలో చూపించి ఆకట్టుకున్నాడు. కాకపోతే కొత్త కథను రాసుకోకుండా  రొటీన్ కథనే సినిమాగా మలిచాడు. కేవలం మాస్ ఆడియన్స్ ను దృష్టి లో పెట్టుకొని సినిమా తెరకెక్కించాడు. ఫస్ట్ హాఫ్ బాగానే నడిపించినప్పటికీ, సెకండ్ హాఫ్ కు వచ్చేసరికి కాస్త తడబడ్డాడు.
  • అలాగే శృతి హాసన్ గ్లామర్ పరంగానే వాడుకున్నాడు తప్ప ఆమెలోని నటనకు అవకాశం ఇవ్వలేదు. చిత్రంలో ముగ్గురు విలన్లు ఉన్నప్పటికీ కథ పరంగా వారిని చూపించలేకపోయారు. కానీ ఓవరాల్ గా మాత్రం సంక్రాంతి బరిలో అసలైన మాస్ ఎంటర్టైనర్ ను మాస్ రాజా అభిమానులకు , సినీ అభిమానులకు ఇచ్చి సక్సెస్ అయ్యాడు. కొద్దీ నెలలుగా హిట్ కోసం ఎదురుచూస్తున్న రవితేజ కు ఓ మాస్ హిట్ ఇచ్చి మరోసారి హిట్ కాంబో అనిపించుకున్నాడు. 

Click here for English Review