రివ్యూ : ఒరేయ్ బుజ్జిగా – వన్ టైం వాచ్ మూవీ

స్టార్ కాస్ట్ : రాజ్ తరుణ్ , మాళవిక నాయర్ , హెబా పటేల్ తదితరులు..
దర్శకత్వం : విజయ్ కొండా
నిర్మాతలు: రాధా మోహన్
మ్యూజిక్ : అనూప్
విడుదల తేది : అక్టోబర్ 02 , 2020
తెలుగు మిర్చి రేటింగ్ : 2.75/5

రాజ్ తరుణ్ – మాళవిక నాయర్ – హెబా పటేల్ జంటగా నరేష్,వాణీ విశ్వనాథ్,పోసాని కృష్ణమురళి,సప్తగిరి ఇతర పాత్రల్లో నటించిన చిత్రం ఒరేయ్ బుజ్జిగా. విజయ్ కుమార్ కొండా డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ గాంధీ జయంతి సందర్బంగా ఆహా ఓటిటి లో రిలీజ్ అయ్యింది. మరి గత కొంతకాలంగా హిట్ లేని రాజ్ తరుణ్ ఒరేయ్ బుజ్జిగా చిత్రం తో హిట్ అందుకున్నాడా..లేదా..అసలు ఈ కథ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.

కథ :

బుజ్జిగాడు (రాజ్ తరుణ్), కృష్ణవేణి (మాళవిక నాయర్)ఇంట్లో వాళ్ళు చూసిన పెళ్లి ఇష్టం లేకా ఇంట్లో నుండి పారిపోతారు.. అయితే ఒకరికి ఒకరు తెలియదు.. ఇద్దరు ఒకేరోజు వెళ్ళిపోవడంతో ఇద్దరూ కలిసి లేచిపోయారన్న పుకారు ఊళ్లో ప్రచారం అవుతుంది. ఆ ఊళ్లో ఉన్న వీళ్ల కుటుంబాలు రెండు బద్ద శత్రువులుగా మరుతాయి. ఆ తరవాత బుజ్జిగాడు, కృష్ణవేణి శ్రీను, స్వాతి పేర్లతో ఒకరికి ఒకరు పరిచయం అవుతారు. ఆ తర్వాత వీరి మధ్య ప్రేమ ఎలా మొదలైంది, మధ్యలోకి హెబా పటేల్ ఎందుకు వచ్చింది అన్నది తెలియాలంటే ఈ సినిమాని చూడాల్సిందే.

ప్లస్ :

  • రాజ్ తరుణ్ – మాళవిక నటన
  • కామెడీ
  • ఫస్ట్ హాఫ్

మైనస్ :

  • సెకండ్ హాఫ్ సాగదీత
  • కథ – కథనం

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

బుజ్జిగాడు లాంటి పాత్రలను ఇప్పటికే రాజ్ తరుణ్ చేసి ఉండడంతో చాలా ఈజ్‌తో నటించాడు. రాజ్ తరుణ్ కి తోడుగా సప్తగిరి, మధు నందన్, సత్య లాంటి కమెడియన్లు తోడవ్వడంతో సినిమాలో కామెడీ సీన్స్ బాగా పేలాయి.. మాళవిక నాయర్ తన పాత్రకి న్యాయం చేసింది. ఎమోషనల్ సీన్స్ లో ఆమె నటన ఆకట్టుకుంటుంది. ఇక కొద్దిసేపే ఉన్న హేబ్బా పటేల్ కూడా బాగా ఆకట్టుకుంది. వాణీ విశ్వనాథ్, రాజా రవీంద్ర, అన్నపూర్ణ, సత్యం రాజేష్ వారివారి పాత్రలకి న్యాయం చేశారు.

సాంకేతిక విభాగం :

సినిమా టెక్నికల్‌గా బాగానే ఉంది. లొకేషన్లను పెద్దగా మార్చకుండా చాలా సింపుల్‌గా గ్రాండ్‌గా తెరకెక్కించారు. ఆండ్రూ సినిమాటోగ్రఫీ చాలా చక్కగా ఉంది. అనూప్ రూబెన్స్ అందించిన పాటలు బాగున్నాయి. ముఖ్యంగా రెండు మెలోడీలు ఆకట్టుకుంటాయి. నంద్యాల రవి రాసిన మాటలు కొన్ని పేలాయి. ‘మోసపోయినట్టు లేదు ప్రాణం పోయినట్టుంది’ వంటి చిన్న చిన్న మాటలు గుచ్చుకుంటాయి. ఈ సినిమాకు ప్రధాన బలహీనత కథనం. దాన్ని ఆకట్టుకునే విధంగా దర్శకుడు నడిపించలేకపోయారు. ఎడిటర్ ప్రవీణ్ పూడి తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది.

ఫైనల్ :

రొటీన్ స్టొరీని చాలా ఫుల్ కామెడీతో నడిపించాడు దర్శకుడు. సినిమా మొత్తంలో గుండె జారి గల్లంతయ్యిందే సినిమాలు ఛాయలు ఎక్కువగా కనిపిస్తాయి. సినిమా ఫస్ట్ హాఫ్ ని చాలా డీసెంట్ గా నడిపించిన దర్శకుడు సెకండ్ హాఫ్ ని చాలా లాగ్ చేశాడని చెప్పాలి. కొన్ని సన్నివేశాలను అనవసరం అన్న ఫీలింగ్ వస్తుంది.

బుజ్జిగాడు, కృష్ణవేణి మధ్యలో వచ్చే లవ్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి.. ఇక సెకండ్ హాఫ్ లో నరేష్ సప్తగిరి మధ్యలో వచ్చే కామెడీ సన్నివేశాలు సినిమాకే హైలెట్ అని చెప్పాలి. ఇద్దరు పోటి మరి నటించారు. ఇక సినిమా క్లైమాక్స్ రొటీన్ గానే ఉంది. ఓవరాల్ గా సినిమా పర్వాలేదు ఓసారి చూసే సినిమా.