నాని జెర్సీ కి భలే గౌరవం దక్కిందే..

నాని – గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో తెరకెక్కిన మూవీ జెర్సీ. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ ఫై క్రికెట్- మిడిల్ క్లాస్ స్ట్రగుల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ తెలుగు నాట హిట్ టాక్ తెచ్చుకొని..మంచి కలెక్షన్లు రాబట్టింది. తాజాగా ఈ మూవీ కి అరుదైన గౌరవం దక్కింది.

ఇంటెర్నేషన్ ఇండియన్ టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్ కి ఎంపికైంది. ఆగస్టు 9 నుండి 15వరకు జరగనున్న ఈ ప్రఖ్యాత ఫిల్మ్ ఫెస్టివల్ లో జెర్సీ మూవీ ప్రదర్శించనున్నారు. ఈ ఫెస్టివల్ లో మూవీ ప్రదర్శించే అవకాశం దక్కడం గొప్ప గౌరవంగా ఫిల్మ్ మేకర్స్ భావిస్తారు. జెర్సీ మూవీతో ఆ ఫీట్ అందుకున్న నాని రికార్డు నెలకొల్పారు.