అభిమాని అభిమానానికి ఫిదా అయినా రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో తన 15 వ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు బ్యానర్ లో పాన్ ఇండియా మూవీ గా భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ రాజమండ్రి పరిసర ప్రాంతాలలో జరుగుతుంది. రామ్ చరణ్ వచ్చాడని సమాచారం తెలుసుకొని పెద్ద ఎత్తున షూటింగ్ స్పాట్ కు చేరుకుంటున్నారు. రామ్ చరణ్ కోసం ఓ అభిమాని చాలా సేపు వెయిట్ చేసి చివరకు చరణ్ ను కలుసుకున్నాడు.

చెర్రీ మీదున్న ప్రేమను అభిమాని చూపించాడు. చేతిపై, చాతిపై ఉన్న టాటూలను చూపించాడు. అవి చూసి రామ్ చరణ్ ఎమోషనల్ అయ్యాడు. అంతే కాకుండా ఉదయం నుంచి ఏమీ తినలేదు అంటూ సదరు అభిమాని చెప్పుకొచ్చాడు. దీంతో రామ్ చరణ్ తన స్టాఫ్ మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఏమీ తినలేదట.. ఏదైనా పెట్టొచ్చు కదా? అంటూ తన స్టాఫ్‌కు రామ్ చరణ్ ఆర్డర్ వేసినట్టు కనిపిస్తోంది. మొత్తానికి ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Fans hero ❤️#MegaPowerStar @AlwaysRamCharan 🔥#SeethaRAMaRajuCHARAN #ManOfMasessRamcharan pic.twitter.com/wzNoeI8Wx5— Siva Cherry (@sivacherry9) February 14, 2022