30 మిలియన్ల మార్క్ దాటినా ‘నాటు నాటు’ సాంగ్

ఆర్ఆర్ఆర్ నుండి రీసెంట్ గా నాటు సాంగ్ రిలీజ్ అయ్యి దుమ్ములేపుతున్న సంగతి తెలిసిందే. ఈ సాంగ్ ను చరణ్ , ఎన్టీఆర్ ఇద్దరు కూడా ఎక్కడ తగ్గకుండా స్టెప్స్ వేసి అభిమానులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఈ సాంగ్‌ను చాలామంది రీ క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. తాజాగా ఈ సాంగ్ 30 మిలియన్ల మార్క్​ దాటేసింది. ప్రేమరక్షిత్ కొరియోగ్రాఫీ చేయగా, కీరవాణి ఈ పాటకు సంగీతమందించారు.

రాజమౌళి డైరెక్షన్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్, అలియా భట్, ఒలివియా మోరిస్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, సముద్రకని, రే స్టీవెన్సన్, అలిసన్ డూడీ సహాయక పాత్రలు నటిస్తున్న మూవీ ఆర్ఆర్ఆర్. ప్రస్తుతం ఈ పాన్ ఇండియా మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. సంక్రాంతి కానుకగా జనవరి 07 న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో మూవీ తాలూకా ప్రమోషన్స్ స్పీడ్ చేసారు.