షర్మిలకు భారతి కి పడటంలేదా….?

వై.ఎస్. జగన్మోహనరెడ్డి సతిమణి భారతికి, జగన్ సోదరి షర్మిలకు ఇటీవల కాలంలో అంతరం పెరుగుతోందా…? ఈ ప్రశ్న వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం అందరినీ కలవరపెడుతున్న సమస్య…. జగన్ జైలుకు వెళ్ళిన అనంతరం సాక్షి గ్రూప్ కు చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న భారతి మీడియా ప్రచారం విషయంలో షర్మిల కు పరిమితంగానే స్పందిస్తున్నట్టు కనపడుతోంది. ‘ మరో ప్రజాప్రస్థానం ‘ పేరిట 3000 కిలోమీటర్ల పాదయాత్ర మొదలెట్టిన షర్మిల కు ప్రజలనుంచి మంచి స్పందన లభిస్తోందని భావిస్తున్న భారతి ఆ పాదయాత్ర విశేషాల కవరేజి పై ప్రత్యేకించి దృష్టి సారిస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీ లో షర్మిల తన బలం పెంచుకుంటోందని, షర్మిల కంటూ ఒక ప్రత్యేక వర్గం పార్టీలో తయారవుతోందని, ఇది మున్ముందు జగన్ రాజకీయ ప్రస్థానానికి ఇబ్బందికరంగా పరిణమించే ప్రమాదం వుందని గ్రహించిన భారతి ఆమెకు విశేష ప్రచారం లభించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని భోగట్టా… సాక్షి పత్రికలో ఇతర నాయకుల ప్రెస్ మీట్లకు ఇచ్చిన ప్రచారం కూడా షర్మిల పాదయాత్రకు ఇవ్వటం లేదని, సాక్షి టి.వి.లో కూడా ఏదో మొక్కుబడిగా మాత్రమే కవరేజ్ ఇస్తున్నారని ఆ పార్టీ నాయకులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.

చంద్రబాబు పాదయాత్రకు ఇతర పత్రికలు, టి.వి. చానెళ్ళు ఇస్తున్న ప్రచారం లో 10 శాతం కూడా షర్మిల యాత్రకు ‘ సాక్షి ‘ లో లభించటం లేదని వారు వాపోతున్నారు. తెలుగు మిర్చి గతంలో పేర్కొన్నట్టు ‘ షర్మిల… ఏకు మేకు అవుతుందా…? ‘ అన్న భావన భారతి మైండ్ లో కూడా బలంగా నాటుకున్నట్టు కనపడుతోంది. అదీ కాక షర్మిల తన యాత్ర ఆసాంతం ప్రభుత్వం పై కాక చంద్రబాబు పైనే అస్త్రాలు సంధిస్తూ ఉండటంతో ఆమె పర్యటనలో ప్రజల పట్ల సానుభూతి కంటే… చంద్రబాబు యాత్రను డైల్యూట్ చేయాలన్న ఆలోచన స్పష్టంగా కనపడుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.