యాపిల్ నుండి సరికొత్త మోడల్స్..

మార్కెట్ లో యాపిల్ ఫోన్ల హావ తగ్గుతున్నప్పటికీ సదరు సంస్థ మాత్రం సరికొత్త మోడల్స్ ను మార్కెట్లోకి తీసుకొస్తూనే ఉంది. ఇప్పటికే పలు రకాల మోడల్స్ తీసుకొచ్చి వార్తల్లో నిలువగా..తాజాగా కాలిఫోర్నియాలోని క్యుప‌ర్టినోలో జ‌రిగిన ఈవెంట్‌లో టిమ్‌కుక్ ఐఫోన్‌11 మోడ‌ళ్ల‌ను రిలీజ్ చేశారు. ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్ 11 ప్రో మ్యాక్ మోడ‌ళ్ల‌ను త‌క్కువ ధ‌ర క్యాట‌గిరీలో తీసుకొచ్చారు.

బ్యాట‌రీ లైఫ్, కెమెరా సిస్ట‌మ్‌, హార్డ్‌వేర్‌ల‌ను మ‌రింత ప‌క‌డ్బ‌దీంగా త‌యారు చేస్తూ యాపిల్ త‌న మోడ‌ళ్ల‌ను రిలీజ్ చేసింది. ఎంట్రీ లెవ‌ల్ ఐఫోన్ 11 కేవ‌లం 700 డాల‌ర్ల‌కు అమ్మ‌నున్నారు. అడ్వాన్స్‌డ్ మోడ‌ళ్లు అయిన ఐఫోన్ 11 ప్రో వెయ్యి డాల‌ర్ల‌కు, ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్‌ను 1100 డాల‌ర్ల‌కు అమ్మ‌నున్నారు.

ఈ మోడల్స్ ప్రత్యేకతలు చూస్తే..

* పాత మోడ‌ళ్ల క‌న్నా.. బ్యాట‌రీ లైఫ్‌ను పెంచారు

* ఐఫోన్ ఎక్స్ఎస్‌ క‌న్నా.. 11 ప్రో నాలుగు గంట‌ల ఎక్కువ బ్యాట‌రీ లైఫ్ ఇవ్వ‌నున్న‌ది.

* ఐఫోన్ ఎక్స్ఎస్ మ్యాక్స్ క‌న్నా.. ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్ బ్యాట‌రీ లైఫ్ అయిదు గంట‌లు ఎక్కువ‌గా ఉంటుంది.

* యాపిల్ వాచ్‌ల‌లో కొత్త వ‌ర్షెన్లు, కొత్త ఐప్యాడ్‌ల‌ను కూడా రిలీజ్ చేశారు.