ఒప్పో నుండి సరికొత్త మోడల్స్ ..

భారతీయ మార్కెట్లోకి ఎప్పటికప్పుడు సరికొత్త మోడల్స్ ను పరిచయం చేసే ఒప్పో..తాజాగా మరో మూడు మోడల్స్ ను తీసుకొచ్చింది. కొన్ని నెలల క్రితమే షార్క్ ఫిన్ పాప్ అప్ కెమెరా, 10X జూమ్‌తో రెనో సిరీస్‌ని భారత మార్కెట్లోకి తీసుకురాగా. ఇప్పుడు రెనో 2 సిరీస్‌ తీసుకొచ్చింది.

రెనో 2, రెనో 2జెడ్, రెనో 2ఎఫ్ మోడల్స్‌ని రిలీజ్ చేసింది. ఈ మూడు ఫోన్లల్లో నాలుగు రియర్‌ కెమెరాలు ఉండటం విశేషం. ఈ మూడు ఫోన్లలో 48 మెగాపిక్సెల్ కెమెరా ఫీచర్ ఉంది. రెనో 2 ధర రూ.36,990, రెనో 2జెడ్ ధర రూ.29,990 కాగా రెనో 2ఎఫ్ నవంబర్‌లో అందుబాటులోకి రానుంది. అప్పుడే ధర తెలుస్తుంది. రెనో 2జెడ్ సేల్ సెప్టెంబర్ 6న, రెనో 2 సేల్ సెప్టెంబర్ 20న ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌క్లూజీవ్‌గా ఈ ఫోన్లు లభిస్తాయి.

ఈ మూడు ఫోన్ల ప్రత్యేకతలు :-

* గేమ్ బూస్ట్ 3.0 మోడ్
* గేమ్ స్పేస్, 3.5 ఎంఎం జాక్
* ఇన్‌-డిస్‌ప్లే పింగర్‌ప్రింట్ సెన్సార్
* టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్, VOOC 3.0 ఫ్లాష్ ఛార్జింగ్
* 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ప్రత్యేకతలున్నాయి.