జాగ్వార్‌ నుండి రెండు సరికొత్త కార్లు..

సరికొత్త మోడల్స్ కు కేరాఫ్ అడ్రెస్ అయినా జాగ్వార్‌ లాండ్‌ రోవర్‌..తాజాగా రెండు సరికొత్త వేరియంట్లను విడుదల చేసింది. రోవర్‌ స్పోర్ట్‌, రేంజ్‌ రోవర్‌ పేరిట విడుదలైన ఈ కార్లలో డీజిల్‌ వేరియంట్‌, పెట్రోల్ వేరియంట్‌లుగా మార్కెట్లోకి వచ్చాయి.

డీజిల్‌ వేరియంట్‌ ధర 99.48 లక్షల రూపాయల నుంచి 1.43 కోట్ల రూపాయల వరకు ఉండగా.. పెట్రోల్‌ వేరియంట్ల ధర 1.10 కోట్ల రూపాయల నుంచి 1.96 కోట్ల రూపాయల వరకు ఉందని సంస్థ తెలిపింది. రేంజ్‌ రోవర్‌ డీజిల్‌ వేరియంట్ల ధర 1.74 కోట్ల రూపాయల నుంచి 3.76 కోట్ల రూపాయల వరకు ఉండగా.. పెట్రోల్‌ వేరియంట్ల ధర 1.87 కోట్ల రూపాయల నుంచి 3.88 కోట్ల రూపాయల వరకు ఉందని కంపెనీ చెప్పుకొచ్చింది.

ఈ రెండు మోడల్స్ లలో ఎలక్ర్టానిక్‌ ఎయిర్‌ సస్పెన్షన్‌ తదితర ఫీచర్లు ఉండడం విశేషం. పూర్తి ఫీచర్లు చేస్తే..

* రేంజ్‌ రోవర్‌లో 250 కెడబ్ల్యు , 386 కెడబ్ల్యు పెట్రోల్‌ పవర్‌ ట్రెయిన్‌ ఆప్షన్లతోపాటు 190 కెడబ్ల్యు, 250 కెడబ్ల్యు డీజిల్‌ పవర్‌ట్రెయిన్‌ ఆప్షన్లు ఉన్నాయి.

* రేంజ్‌ రోవర్‌ స్పోర్ట్‌లో 250 కెడబ్ల్యు, 386 కెడబ్ల్యు పెట్రోల్‌ పవర్‌ ట్రెయిన్‌ ఆప్షన్లతోపాటు 190 కెడబ్ల్యు, 250 కెడబ్ల్యు డీజిల్‌ పవర్‌ట్రెయిన్‌ ఆప్షన్లు ఉన్నట్లు తెలుస్తుంది.