హుందాయ్ నుండి సరికొత్త వాహనం..

ప్రముఖ వాహన తయారీ సంస్థ హుందాయ్..తాజాగా క్రెటా స్పోర్ట్ పేరిట నూతన ఎస్ యూవీ వాహనాన్ని బ్రెజిల్‌ లో విడుదల చేసింది. స్పోర్టివ్ లుక్, స్టైలిష్ డిజైనింగ్, అధునాతన సౌకర్యాలను ఈ వాహనం లో పొందుపరచారు. అలాగే ఇంటీరియర్, ఎక్స్ టీరియర్ ల విషయంలోను సంస్థ చాలా ప్రత్యేకతలను కల్పించినట్లు తెలుస్తుంది.

ఇక రోడ్డుపై జరిగే ప్రమాదాలను ముందుగానే పసిగట్టే విధంగా వాహనం ముందు, వెనుక భాగంలో సెన్సార్ లను అమర్చారు. సీటింగ్ విషయంలో కూడా చాలా ప్రత్యేకతలు క్రెటా స్పోర్ట్ లో కల్పించారు. షార్క్ ఫిన్ యాంటీనా, స్కిడ్ ప్లేట్, రూప్ రైల్స్ ను ఈ వాహనాన్ని పొందుపరిచారు. ఇక వాహనం లోపలి భాగంలో సీటింగ్, డ్యాష్‌ బోర్డులను పూర్తిగా బ్లాక్ లెదర్ కవర్లతో తయారుచేసారు. స్టీరింగ్ ముందు భాగంలో బ్లూ మీడియా ఇన్ ఫోటైన్ మెంట్ సిస్టమ్ అమర్చారు. దీని ద్వారా డిజిటల్ టీవీ, అండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే తదితర అత్యాధునిక సౌకర్యాలను కల్పించారు. స్టీరింగ్, గేర్ లివర్, ఏసీ చుట్టు, డోర్ హండిల్స్ వద్ద క్రోమ్ ఫినిషింగ్ తో అందంగా రూపోందించారు.

ఇక ఇంజన్ విషయానికి వస్తే 2019 క్రెటా స్పోర్ట్ ఎస్ యూవీలో 2.0 లిటర్ డీవీవీటీ 16వీ ఫ్లేక్జ్ ఇంజన్ ను అమర్చారు. 156 హెచ్ పీ, 187.31 ఎన్ ఎమ్ టార్గ్ తో పవర్ ను విడుదల చేస్తుంది. 6 గ్రేర్లతో ఆటో ట్రాన్స్ మీషన్ ను అమర్చారు.