మార్కెట్లోకి సరికొత్త సాంత్రో కార్..

ప్రముఖ వాహన సంస్థ హ్యుండయ్ మోటార్స్ నుండి ఇప్పటికే పలు మోడల్ కార్స్ వచ్చి వాహనదారులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. తక్కువ బడ్జెట్ ధరల లో కార్లను అందిస్తూ మార్కెట్ లో తన సత్తా చాటుకుంటూ వస్తుంది. తాజాగా ఈ సంస్థ నుండి సాంత్రో కొత్త లుక్‌తో మరోసారి మార్కెట్‌లోకి వచ్చేసింది.

ఈ కార్ ప్రత్యేకతలు చూస్తే..

* సిలిండర్ 1.1 లీటర్ ఇంజిన్‌ ను కలిగి ఉంది.
* స్మార్ట్ ఆటో ఏఎంటీ టెక్నాలజీ, ఫ్యాక్టరీలోని నిర్మితమైన సీఎన్‌జీ ఆప్షన్‌తో వస్తుంది.
* కారు లోపల 17.64 సెంటీమీటర్ల టచ్ స్క్రీన్ ఆడియో వీడియో సిస్టమ్
* ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, మిర్రర్ లింక్‌లాంటి స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ
* వాయిస్ రికాగ్‌నిషన్, రియర్ పార్కింగ్ కెమెరా డిస్‌ప్లే
* స్టాండర్డ్ ఏబీఎస్, డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్ ఈ కొత్త సాంత్రో కారులో ఉన్నాయి.
* ముందు, వెనుక ఏసీలు అందుబాటులో ఉన్నట్లు తెలుస్తుంది.

ఈ కారు ప్రి బుకింగ్స్ బుధవారం నుంచి ఈ నెల 22 వరకు కొనసాగనున్నాయి. రూ.11,100 టోకెన్ అమౌంట్‌తో ఈ కారును బుక్ చేసుకోవచ్చు.