షారుఖ్ చేతులమీదుగా సాంత్రో విడుదల

భారత మార్కెట్లో ఎప్పటికప్పుడు సరికొత్త మోడల్స్ ను అందిస్తూ తన సత్తా చాటుతున్న హ్యుండాయ్ ..తాజాగా మరోసారి సరికొత్త సాంత్రో మోడల్ ను తీసుకొచ్చింది. హ్యుండాయ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న బాలీవుడ్ బాద్షా ఈ న్యూ మోడల్ కార్ ను లాంచ్ చేసాడు. కొత్త లుక్, ఆధునిక టెక్నాలజీతో మార్కెట్లోకి వచ్చిన ఈ కార్ ప్రత్యేకతలు చూద్దాం.

* 4-సిలిండర్ 1.1 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌
* తొలిసారి ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (ఏఎంటీ) టెక్నాలజీ
* సీఎన్‌జీ ఫ్యుయెల్ ఆప్షన్స్ ఉండేలా ఈ కార్ ను తయారు చేసారు.

ఈ సరికొత్త కార్ వాహనదారులను విపరీతంగా ఆకట్టుకుంటుందని సంస్థ ప్రెతినిధులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.