వోల్వో ఎక్స్‌సీ40 వేరియంట్స్‌ బుకింగ్ ప్రారంభం..

స్వీడన్‌కు చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ వొల్వో తాజాగా ఎక్స్‌సీ40 లో రెండు సరికొత్త వేరియంట్స్‌కు బుకింగ్స్‌ మొదలు పెట్టింది. ఎక్స్‌సీ40 డీ4 మొమెంటమ్‌ రేటు రూ. 39.9 లక్షలుగాను, డీ4 ఇన్‌స్క్రిప్షన్‌ వేరియంట్‌ ధర రూ.43.9 లక్షలుగాను (ఎక్స్‌ షోరూం)గా నిర్ణయించింది. ప్రస్తుతం బుక్ చేసుకున్న వారికీ ఈ నెలాఖరు నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయని సంస్థ తెలిపింది.

ఆర్‌–డిజైన్‌ వేరియంట్‌ రేటును రూ. 42.9 లక్షలకు పెంచినట్లు ప్రకటించింది. జూలై 4న ప్రారంభ ఆఫర్‌ కింద దీన్ని రూ. 39.9 లక్షలకు అందించినట్లు, ఇప్పటిదాకా 200 యూనిట్లకు ఆర్డర్లు వచ్చినట్లు సంస్థ తెలిపింది. ఎస్‌యూవీ ఎక్స్‌సీ 40 విషయానికి వస్తే..మెర్సిడెజ్ బెంజ్ జీఎల్‌ఏ, బీఎండబ్ల్యూ ఎక్స్1, ఆడీ క్యూ3 లకు పోటీగా విడుదల చేసిన 2 లీటర్ల డీజిల్ ఇంజిన్ కలిగిన ఈ కారు 190 హార్స్‌పవర్ శక్తినివ్వనున్నది. ఈ ఎక్స్‌సీ40 కారు డ్రైవర్ అప్రమత్తత, రోల్ స్టెబిలిటి కంట్రోల్ ఆధారిత ఏడు ఎయిర్ బ్యాగ్‌లు కలిగి ఉంది.