సౌందర్య లహరి ఈ వయసులో ఏంటి ఆ పోజులు

20 ఏళ్ల క్రితం రాఘవేంద్రరావు డైరెక్షన్లో వచ్చిన పెళ్లి సందడి సినిమా ఎంతమందికి గుర్తుందో..అందులో నటించిన నటి నటులు కూడా అంతే గుర్తుంటారు. ముఖ్యంగా సౌందర్య లహరి.. స్వప్న సుందరి దీప్తి భట్నాగర్ గురించి చెప్పాల్సిన పనిలేదు. నడుము ఓపులతో యావత్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అప్పుడే కాదు ఇప్పుడు 50 ఏళ్లు వచ్చినా కూడా అలాగే హాట్ అందాలతో ఆకట్టుకుంటుంది.

హాట్ ఫోటో షూట్ చేస్తూ ఈ తరం హీరోయిన్లకు తానేమీ తీసిపోనంటోంది. అయినా వయసు మనిషికే కాని మనసుకి కాదంటూ చెప్పుకుంటూ తనలోని అందాలను బయటకు చూపిస్తుంది. నాల్గు రోజుల క్రితం తన 51వ పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకుంది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టా ఫాలోయర్లకు చెబుతూ హాట్ గ్లామరస్ ఫొటోను పోస్టు చేసింది. ఇక ఈ ఫోటో కు నెటిజన్ల అంత ఫిదా అవుతున్నారు.