అలర్ట్ : దూసుకొస్తున్న ‘పెథాయి’ తుఫాన్

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పాడిన తీవ్ర వాయుగుండం శ్రీహరికోటకు 790 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. చెన్నైకి 775 కిలోమీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండం కదులుతోంది. ఈ రోజు మధ్యాహ్నం తుపాన్‌గా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి పెథాయ్‌ తుఫాన్‌గా నామకరణం చేశారు. 17న రాత్రి తూర్పుగోదావరి- విశాఖ మధ్య తుఫాను తీరం దాటే అవకాశాలు ఉన్నట్లు వాతావారణ శాఖ తెలిపింది. 18 వరకూ ఇది తుపానుగానే కొనసాగే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

వేగంగా దూసుకువస్తున్న ‘పెథాయ్’ తుఫాన్‌ పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తుఫాన్ పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. జిల్లాల్లో తుఫాన్ ముందస్తు సన్నద్ధతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని అధికారులని ఆదేశించారు.