రివ్యూ : ఏబీసీడీ – మెగా ఫ్యాన్స్ కు నిరాశే

స్టార్ కాస్ట్ : అల్లు శిరీష్‌, రుక్సర్‌ ధిల్లాన్‌ తదితరులు..
దర్శకత్వం : సంజీవ్‌ రెడ్డి
నిర్మాతలు: మథురా శ్రీధర్‌, యష్‌ రంగినేని
మ్యూజిక్ : జుడా సాండీ
విడుదల తేది : మే 17, 2019
తెలుగు మిర్చి రేటింగ్ : 2.25/5

రివ్యూ : ఏబీసీడీ – మెగా ఫ్యాన్స్ కు నిరాశే

గౌరవం , కొత్త జంట చిత్రాలతో నిరాశ పరిచిన అల్లు శిరీష్..ఆ తర్వాత పరుశురాం డైరెక్షన్లో శ్రీరస్తు శుభమస్తు సినిమా తో మంచి హిట్ అందుకొని అభిమానులను ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత థ్రిల్లర్ జానర్ లో విఐ ఆనంద్ డైరెక్షన్లో ఒక్క క్షణం సినిమా చేసినప్పటికీ ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. దాంతో కాస్త గ్యాప్ తీసుకొని మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘ఏబీసీడీ’ సినిమాను తెలుగులో అదే టైటిల్ తో రీమేక్ చేసాడు.

సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ అధినేత డి.సురేష్ బాబు స‌మ‌ర్ప‌ణ‌లో మ‌ధుర ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాల‌పై తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి మలయాళం హిట్ అందుకున్న ఈ మూవీ తెలుగులో ఎలాంటి ఫలితాన్ని చవిచూసింది..శిరీష్ కు ఈ సినిమా ఎంత కలిసొచ్చింది..? నూతన ఆ డైరెక్టర్ సంజీవ్ రెడ్డి ఈ సినిమా తో తన సత్తా చూపించాడా..లేదా..? అసలు కథ ఏంటి..? అనేది ఇప్పుడు చూద్దాం.

కథ :

అర‌వింద్ అలియాస్ అవి (అల్లు శిరీష్‌) అమెరికా లో కోటీశ్వరుడి కొడుకు..డాలర్ల మధ్య పెరిగిన అవి..వాటి విలువ అసలు తెలియదు. మెట్టు మెట్టు ఎదుగుతూ వచ్చిన తండ్రి..కొడుకును మాత్రం డబ్బు విలువ ఏంటి అనేది తెలియకుండా పెంచుతాడు. దీంతో పని పాట లేకుండా జులాయిగా తిరుగుతున్న కొడుకును చూసి..ఎలాగైనా డబ్బు విలువ తెలిసొచ్చేలా చేయాలనీ ప్లాన్ చేస్తాడు.

ఆలా అర‌వింద్ ను ఇండియాకు పంపిస్తాడు. నెలకు కేవలం రూ. 5 వేలు పంపిస్తూ బ్రతకమని చెపుతాడు. మరి ఆ 5 వేలతో అర‌వింద్ ఎలా జీవనం సాగించాడు..? ఎలాంటి కష్ఠాలు అనుభవించాడు..? అర‌వింద్ కు డబ్బు విలువ తెలిసొచ్చిందా లేదా..? అనేది అసలు కథ.

ప్లస్ :

* అక్కడక్కడా కామెడీ

మైనస్ :

* కథ – కథనం

* మ్యూజిక్

* స్లో నేరేషన్

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* అల్లు శిరీష్ నటన గురించి చెప్పాల్సిన పని లేదు. మెగా ఫ్యామిలీ అనగానే నటనతో సంబంధం లేకుండా చూస్తారని అనుకుంటారు కానీ ఈరోజుల్లో ప్రేక్షకులు ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏమాత్రం చూడడం లేదు..చరణ్ లాంటి హీరోల సినిమాలే బాగాలేకపోతే సాయంత్రం కల్లా ఆ రిజల్ట్ స్పష్టం గా చూపిస్తున్నారు.

ఇక శిరీష్ విషయానికి వస్తే నటనలో ఇంకా ఓనమాల దగ్గరే ఉన్నాడు..ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో తన నటన తో ఆకట్టుకున్నాడు అని పేరు రాలేదు. ఏదో డైరెక్టర్ చెపుతున్నాడు..చేస్తున్నాడు తప్ప నటన లో కొత్తదనం ఏమి లేదు. ఇక ఈ సినిమాలోనూ అదే రిపీట్ అయ్యింది. శిరీష్ ఫ్రెండ్ రోల్ లో భ‌ర‌త్ న‌టించాడు. ఇద్దరూ క‌లిసి చేసిన కామెడీ జెస్ట్ ఆలా నవ్విచ్చింది అంతే.

హీరోయిన్ రుక్సార్ ధిల్లన్ నటనకు పెద్దగా మార్కులేమి పడలేదు..కాకపోతే తెరపై అందంగా కనిపించింది.

ప్రతినాయ‌కుడిగా పాత్రలో కనిపించిన సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి త‌న‌యుడు రాజా బాగానే ఆకట్టుకున్నాడు

ఇక మిగతా పాత్రల్లో నటించిన నాగబాబు , కోట శ్రీనివాస రావు మొదలగు వారు వారి వారి పాత్రల్లో పర్వాలేదు అనిపించారు.

సాంకేతిక విభాగం :

* జుడా సాండీ అందించిన మ్యూజిక్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.

* రామ్‌ సినిమాటోగ్రఫి సినిమాకు హైలైట్ అయ్యింది.

* ఎడిటింగ్‌ విషయంలో చాల తప్పిదాలే జరిగాయి. సెకండ్ హాఫ్ చాల స్లో గా నడిచింది.

* నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

డైరెక్టర్ విషయానికి వస్తే..మలయాళంలో సూపర్‌ హిట్ అయిన ఏబీసీడీ సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కొద్ది పాటు మార్పులతో రీమేక్‌ చేశాడు దర్శకుడు సంజీవ్ రెడ్డి. కానీ ఆ ఫీల్ ను తీసుకరాలేకపోయాడు.

కామెడీ..లవ్ ఇలా ఏది కూడా వర్క్ అవుట్ చేయలేకపోయాడు. కథ కు – హీరో లుక్ కు సంబంధం లేకుండా ఉంది. రోజుకి రూ.82 రూపాయ‌ల‌తో బ‌తుకుతున్నాన‌ని హీరో చెబుతుంటాడు కానీ.. అత‌ని లుక్ కానీ, గ‌డిపే జీవితం కానీ అలా ఉండ‌దు. ఎప్పుడూ బ్రాండెడ్ దుస్తుల‌తో రిచ్‌గా కనిపిస్తుంటాడు. మరి కథ తో సంబంధం లేదు అనుకున్నాడో..హీరో అంటే అలాగే ఉండాలని అనుకున్నాడో కానీ చూసే ప్రేక్షకుడు మాత్రం ఎప్పడూ అయిపోద్ది రా..అనుకున్నారు. ఓవరాల్ గా శిరీష్ ఈ సినిమాపై గట్టి ఆశలే పెట్టుకున్నప్పటికీ..నిరాశే మిగిలిందని చెప్పాలి.

తెలుగు మిర్చి రేటింగ్ : 2.25/5

Click here for English Review