రివ్యూ : ఎంత మంచివాడవురా – స్లో ఎమోషనల్ డ్రామా

స్టార్ కాస్ట్ : కళ్యాణ్ రామ్ , మెహ్రీన్ తదితరులు..
దర్శకత్వం : స‌తీశ్ వేగేశ్న‌
నిర్మాతలు: ఆదిత్య మ్యూజిక్
మ్యూజిక్ : గోపిసుందర్
విడుదల తేది : జనవరి 15, 2019
తెలుగు మిర్చి రేటింగ్ : 2.75/5

రివ్యూ : ఎంత మంచివాడవురా – స్లో ఎమోషనల్ డ్రామా

కళ్యాణ్ రామ్ – మెహ్రిన్ జంటగా శతమానం భవతి ఫేమ్ స‌తీష్ వేగేష్న ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన మూవీ ఎంత మంచివాడ‌వురా. పక్క ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా సంక్రాంతి కానుకగా ఈరోజు (జనవరి 15 ) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ చిత్రం ద్వారా ఆదిత్యా మ్యూజిక్‌ సంస్థ తొలిసారిగా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టడం విశేషం. ఆదిత్యా మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా ఈ చిత్రాన్ని నిర్మించారు. గోపీ సుందర్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రం ఎలా ఉంది..పబ్లిక్ ఏమంటున్నారు..సతీష్ ..కళ్యాణ్ రామ్ కు హిట్ ఇచ్చాడా లేదా అనేది ఇప్పుడు చూద్దాం.

కథ :

బాలు (కళ్యాణ్ రామ్) చిన్నప్పుడే ఓ ఆక్సిడెంట్ లో తల్లిదండ్రులు చనిపోవడం తో అనాధగా పెరుగుతాడు. బాలు మనస్తత్వం నచ్చి నందు(మెహ‌రీన్‌) పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. తన స్నేహితుల దగ్గర ఓ విషయాన్ని దాచిపెడతాడు బాలు. అయితే ఈ విషయం నందు, బాలు ఫ్రెండ్స్‌కు తెలియడంతో వారు
బాలు ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఇంతకీ బాలు దాచిపెట్టిన విషయం ఏంటి..? ఆ తర్వాత ఏం జరుగుతుంది..? బాలు ను ఎవరు పెద్ద చేస్తారు..అసలు బాలు కు ఎవరు ఇష్టం..అనేది సినిమా చూస్తే మీకు తెలుస్తుంది.

ప్లస్ :

* కళ్యాణ్ రామ్

* వెన్నెల కిషోర్ కామెడీ

* బంధాలు – అనుబంధాలు

మైనస్ :

* కథనం

* సెకండ్ హాఫ్

* మ్యూజిక్

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* ఇప్ప‌టి వ‌ర‌కు యాక్ష‌న్ సినిమాల‌నే చేస్తూ వ‌చ్చిన హీరో క‌ల్యాణ్ రామ్ పూర్తిస్థాయి కుటుంబ క‌థా చిత్రంలో న‌టించాడు. తన పాత్ర‌కు వంద శాతం న్యాయం చేశాడు.

* మెహ‌రీన్ చ‌క్క‌గా న‌టించింది.

* విలన్‌గా కనిపించిన రాజీవ్‌ కనకాల తనదైన పెర్మార్మెన్స్‌ కనబర్చాడు.

* ఇక న‌రేశ్‌, శ‌ర‌త్‌బాబు, ప‌విత్ర‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, విజ‌య్ కుమార్ త‌దిత‌రులు వారివారి పాత్ర‌ల్లో ఒదిగిపోయారు.

సాంకేతిక విభాగం :

* గోపీ సుంద‌ర్ పాట‌లు ఆక‌ట్టుకునేలా లేవు. నేప‌థ్య సంగీతం ఓకే.

* రాజ్‌తోట సినిమాటోగ్ర‌ఫీ చాలా బావుంది. ప్ర‌తి స‌న్నివేశం రిచ్‌గా, నేచుర‌ల్‌గా బావుంది.

* ఇక ఎడిటర్ అనవసరమైన సీన్స్ ని ఇంకా టైట్ గా ట్రిమ్ చేసి ఉండి ఉంటే, సినిమాలో చాల వరకు బోర్ తగ్గేది.

* శ‌త‌మానం భ‌వ‌తి, శ్రీనివాస క‌ల్యాణం చిత్రాల్లో విల‌నిజాన్ని చూపించ‌ని ద‌ర్శ‌కుడు స‌తీశ్ వేగేశ్న ఈ సినిమాలో విలనిజాన్ని కూడా యాడ్ చేశాడు. ద‌ర్శ‌కుడు ఎంచుకున్న పాయింట్ బావున్నా.. దాన్ని స్లో నెరేష‌న్‌లో తెరకెక్కించేసరికి అందరికి బోర్ కొట్టిస్తుంది. ఓవరాల్ గా సంక్రాంతి బరిలో వచ్చిన ఈ మూవీ అందర్నీ ఆకట్టుకోవడంలో విఫలం అయ్యింది.

తెలుగు మిర్చి రేటింగ్ : 2.75/5

Click here for English Review