రివ్యూ : పేట – రజనీ రివెంజ్ డ్రామా

స్టార్ కాస్ట్ : రజనీకాంత్ , సిమ్రాన్, త్రిష తదితరులు..
దర్శకత్వం : కార్తీక్ సుబ్బరాజన్
నిర్మాతలు: క‌ళానిధి మార‌న్‌, అశోక్ వ‌ల్ల‌భ‌నేని
మ్యూజిక్ : అనిరుధ్
విడుదల తేది : జనవరి 10, 2018
తెలుగు మిర్చి రేటింగ్ : 2.75/5

రివ్యూ : పేట – రజనీ రివెంజ్ డ్రామా

వయసు తో సంబంధం లేకుండా అభిమానులను అలరిస్తూ వస్తున్నాడు సూపర్ స్టార్ రజనీకాంత్..రజనీ నుండి సినిమా అంటే తమిళనాట పెద్ద పండగలా భావిస్తారు..వారం ముందు నుండే థియేటర్స్ దగ్గర సందడి మొదలు అవుతుంది. ఇక పేట విషయంలోనూ అదే జరిగింది. గత ఏడాది 2 .ఓ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రజనీ , కార్తీక్ సుబ్బరాజన్ డైరెక్షన్లో పేట చిత్రాన్ని చేసాడు.

త్రిష , సిమ్రాన్ లు హీరోయిన్లుగా నటించగా , విజయ్ సేతుపతి, నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రలు పోషించగా , అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించారు. తమిళంలో సన్ పిక్చర్ విడుదల చేయగా , తెలుగులో వల్లభనేని అశోక్ విడుదల చేసారు. తెలుగునాట కూడా రజనీ కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. మరి వారిని పేట తో ఎలా అలరించాడు..? సంక్రాంతి బరిలో విజయం అందుకున్నాడా లేదా..? అసలు పేట కథ ఏంటి..? అనేది ఇప్పుడు చూద్దాం.

కథ :

కాళీ(రజనీకాంత్) ఓ గ్రామానికి పెద్ద. అందరికి తలలో నాలుకగా ఉంటూ భార్య(త్రిష)ను ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. ఇతనికి తమ్ముడు మలిక్(శశికుమార్)అంటే ప్రాణం. అనుకోకుండా ఆ ఊరికి సింహాచ‌లం(నవాజుద్దీన్ సిద్ధిక్)వల్ల ముప్పు ఏర్పడుతుంది. అప్పుడు జరిగిన గొడవల్లో కాళీ తమ్ముడితో పాటు భార్యను పోగొట్టుకుని ఆ గ్రామం వదిలి వెళ్ళిపోతాడు.

ఆలా వెళ్లిన కాళీ..ఓ హాస్టల్ వార్డెన్ గా పనిచేస్తాడు. అక్కడ విద్యార్ధి నాయకుడు మైకేల్(బాబీ సింహ)దే రాజ్యం. కాళీ అతనికి నచ్చడు. బయటికి పంపే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అక్కడే ఉండే పారు(సిమ్రాన్)కాళీ మీద మనసు పారేసుకుంటుంది. మరోవైపు గ్రామంలో గొడవల వల్ల దెబ్బ తిని కసి మీదున్న జీతూ(విజయ్ సేతుపతి)కాళీని చంపేందుకు వెతుకుతూ ఉంటాడు. మరి జీతూ కు కాళీ జాడ తెలుస్తుందా..? అసలు కాళీ ఫ్యామిలీ ని సింహాచలం ఎందుకు చంపాల్సి వస్తుంది..? అనేది కథ.

Also Read :   రివ్యూ : భైర‌వగీత - ఫ్యాక్షన్ లవ్ స్టోరీ

ప్లస్ :

* రజనీకాంత్ యాక్టింగ్

* ఫస్ట్ హాఫ్

* రజనీ – సిమ్రాన్ ల సన్నివేశాలు

* మ్యూజిక్

మైనస్ :

* సెకండ్ హాఫ్

* కథ

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* రజనీకాంత్ యాక్టింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు..ఏ రోల్ ఇచ్చిన అందులో చించేస్తాడని మనకు తెలిసిందే. ఇక ఈ చిత్ర విషయానికి వస్తే..90ల నాటి రజినీకాంత్‌ను గుర్తు చేసాడు. నటన, కామెడీ టైమింగ్, ఫైట్లు, మాస్ డాన్సులతో అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.

కుర్రాడిలా ర‌జ‌నీకాంత్ ఇచ్చే హావ‌భావాలు ప్రేక్షకులను బాగా అలరించాయి. ఈ వ‌య‌సులోనూ అంత జోరుగా న‌టించ‌డం ఒక్క రజినీకి చెల్లుతుంది.

* ఇక సిమ్రాన్ చాల రోజుల తర్వాత తెరపై కనిపించింది. రజనీకాంత్ – సిమ్రాన్ ల మధ్య వచ్చే లవ్ ట్రాక్ బాగుంది. రజనీతో చాల ఈజీ గా నటించింది.

* రజనీ భార్య గా త్రిష కూడా ఆకట్టుకుంది.

* బాలీవుడ్ నటుడు న‌వాజుద్దీన్ సిద్ధిఖీ, విజయ్ సేతుపతి వంటి స్టార్స్ ఉన్నప్పటికీ వారికీ సరైన రోల్ దక్కలేదు. దీంతో వారి యాక్టింగ్ నామమాత్రంగానే ఉంది.

* ఇక మిగిలిన నటి నటులు వారి వారి పాత్రలకు తగ్గట్లు నటించారు.

సాంకేతిక విభాగం :

* అనిరుద్ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి..మాస్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రానికి అనిరుద్ అదిరిపోయే మాస్ బిట్స్ అందించి సినిమా సక్సెస్ కు కారణమయ్యాడు. నేపధ్య సంగీతం కూడా ఆకట్టుకుంది.

Also Read :   ' పేట ' టాక్..

* తిరు సినిమా ఫొటోగ్రఫీ ఆకట్టుకుంది.

* వివేక్ హర్షన్ ఎడిటింగ్ పర్వాలేదు.

* సన్ పిక్చెర్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

* ఇక డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజన్ విషయానికి వస్తే..తన జోనర్ కు సంబంధం లేకుండా ఈ సినిమాను తెరకెక్కించాడు. కేవలం రజనీకాంత్ ను అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలాగే చూపించాడు. ఫస్ట్ హాఫ్ అంత ‘న‌ర‌సింహ’, ‘ముత్తు’, ‘అరుణాచ‌లం’ సినిమాల్లో రజనీకాంత్ ఎలా ఉంటాడో అలాగే చూపించారు. కామెడీ , డాన్స్, లవ్ ట్రాక్ ఇలా అన్ని కూడా బాగా అలరించేలా తెరకెక్కించాడు.

ఇక సెకండ్ హాఫ్ లో అసలైన సినిమా ట్విస్ట్ చూపించాడు. కాకపోతే అది కొత్తగా ఏమిలేదు..అన్ని సినిమాల్లో ఉండే కథనే రాసుకున్నాడు తప్ప సరికొత్త కథను మాత్రం రాసుకోలేకపోయాడు. పేట కాస్త కాళీ గా ఎందుకు మారాల్సి వచ్చింది..దానికి జరిగిన సంఘటనలు అవే చూపించాడు. ఇంకాస్త కథ విషయంలో కొత్తగా ఆలోచిస్తే బాగుండేది.

చివరగా :

రజనీకాంత్ అభిమానులను పేట బాగా నచ్చుతుంది..ఇదో రివెంజ్ డ్రామా. సినిమా చూసిన వారంతా 90ల నాటి రజినీకాంత్‌ను గుర్తుచేసుకుంటారు. ఫస్ట్ హాఫ్ బాగా నచ్చుతుంది..కానీ సెకండ్ హాఫ్ మాత్రం రొటీన్ అనిపిస్తుంది.

నోట్ :

సినిమాను థియేటర్స్ లలో చూడండి..పైరసీ చేసి సినిమా ఇండస్ట్రీని నాశనం చేయకండి. ఎంతో ఖర్చు పెట్టి సినిమాలు తీస్తుంది కేవలం మన ఆనందం కోసమే..అలాంటి ఆనందాన్ని పైరసీ లో చూడకండి.

తెలుగు మిర్చి రేటింగ్ : 2.75/5

Click here for English Review

Tagged: , , ,