ఈరోజే అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌..

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ప్రతి ఏడూలాగానే ఈ ఏడూ కూడా ప్రైమ్‌ డే సేల్‌ ను తీసుకొస్తుంది. సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి మంగళవారం అర్ధరాత్రి వరకు ఇది కొనసాగుతుంది. అంటే 36 గంటలపాటు ఈ ప్రైమ్‌డే సేల్‌ కొనసాగబోతుంది. ఈ ప్రైమ్‌డే సేల్‌ లో భాగంగా వినియోగదారుల కోసం భారీ ఆఫర్లను పొందపరచబడింది.

మొత్తం 17 దేశాలలో అమెజాన్‌ ప్రైమ్‌డే సేల్‌ కొనసాగుతుంది. మనదేశంలో గత ఏడాది దీనిని ప్రారంభించారు. ఈ ఏడాది రెండవసారి దీనిని కొనసాగించబోతున్నారు. సాధారణంగా లభించే అనేక వస్తువులతోపాటు అమెజాన్‌ ప్రైమ్‌డే సేల్‌లో కొన్ని కొత్త వస్తువులను ప్రత్యేకంగా అందుబాటులోకి తెస్తారు. అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ ఉన్నవారికి మాత్రమే అమెజాన్‌ ప్రైమ్‌డే సేల్‌లో వస్తువులు కొనే అవకాశం లభిస్తుంది.