మరోసారి ఫ్లిప్‌కార్ట్ భారత్ లో తన సత్తా చాటుకుంది..

ప్రముఖ ఆన్లైన్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మరోసారి భారత్ లో తన సత్తా చాటింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ బిలియన్ డే’ సేల్ ను నిర్వహిస్తుంది. పండగ సీజన్ కావడం , ఆఫర్స్ భారీగా ప్రకటించడం తో వినియోగదారులంతా ఈ సేల్ లో నిమగ్నమయ్యారు. ఈ నెల 10న ప్రారంభించిన ఈ సేల్‌లో మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, ఇతర ఉపకరణాలపై భారీ ఆఫర్లు ప్రకటించడం తో మొదటి రోజు స్మార్ట్‌ఫోన్లు విపరీతంగా సేల్ అయ్యాయి.

మొదటి గంటలోనే 10 లక్షల ఫోన్లు అమ్మేసిన ఫ్లిప్‌కార్ట్.. ఒక్క రోజులో ఏకంగా 30 లక్షల ఫోన్లు విక్రయించింది. భారత రిటైల్ మార్కెట్ చరిత్రలో ఇన్ని ఫోన్లు విక్రయించడం ఇదే తొలిసారని ఫ్లిప్‌కార్ట్‌ సీనియర్‌ డైరెక్టర్‌ స్మృతి రవిచంద్రన్‌ తెలిపారు. ఫ్లిప్‌కార్ట్ విక్రయించిన ఫోన్లలో రియల్ మీ, షియోమీ, నోకియా, ఆసుస్, శాంసంగ్, ఆనర్, ఇన్ఫినిక్స్ తదితర కంపెనీల ఫోన్లు ఉన్నట్లు తెలుస్తుంది.