గూగుల్ పిక్స‌ల్ సరికొత్త ఫోన్లు..

ప్రముఖ గూగుల్ పిక్స‌ల్ నుండి సరికొత్త మోడల్స్ ను అమెరికాలోని న్యూయార్క్‌లో విడుదల చేసింది. పిక్స‌ల్ 4, పిక్స‌ల్ 4ఎక్స్ఎల్ పేరిట విడుదల చేసిన ఈ ఫోన్ల లో సరికొత ఫీచర్లు ఉన్నాయి. పిక్స‌ల్ 4లో 5.7 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఓలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేయ‌గా, పిక్స‌ల్ 4ఎక్స్ఎల్‌లో 6.3 ఇంచుల క్వాడ్ హెచ్‌డీ ప్ల‌స్ ఓలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు.

అక్టోబర్ 24 నుండి ఈ ఫోన్లు ఇతర దేశాలలో విడుదల చేయబోతున్నారు. ఇక ఈ రెండు ఫోన్ల ధరలు చూస్తే..గూగుల్ పిక్స‌ల్ 4 (64జీబీ) ధ‌ర – 799 డాల‌ర్లు (దాదాపుగా రూ.57,105), గూగుల్ పిక్స‌ల్ 4 (128జీబీ) ధ‌ర – 899 డాల‌ర్లు (దాదాపుగా రూ.64,250), గూగుల్ పిక్స‌ల్ 4ఎక్స్ఎల్ (64జీబీ) ధ‌ర – 899 డాల‌ర్లు (దాదాపుగా రూ.64,250), గూగుల్ పిక్స‌ల్ 4ఎక్స్ఎల్ (128జీబీ) ధ‌ర – 999 డాల‌ర్లు (దాదాపుగా రూ.71,400) గా నిర్ణయించారు.

ఇక ఈ రెండు ఫోన్లలో మరిన్ని ఫీచర్లు చూస్తే..

* పిక్స‌ల్ 4 ఎక్స్ఎల్ :-

* 6.3 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ప్ల‌స్ ఓలెడ్ డిస్‌ప్లే, 2960 x 1440 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌
* గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 855 ప్రాసెస‌ర్‌, 6 జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్
* ఆండ్రాయిడ్ 10, డ్యుయ‌ల్ సిమ్‌, 12.2, 16 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు
* 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఐపీ 68 వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్‌, 4జీ వీవోఎల్‌టీఈ
* బ్లూటూత్ 5.0 ఎల్ఈ, యూఎస్‌బీ టైప్ సి, ఎన్ఎఫ్‌సీ
* పిక్స‌ల్ 4 – 2800 ఎంఏహెచ్ బ్యాట‌రీ, పిక్స‌ల్ 4ఎక్స్ఎల్ – 3700 ఎంఏహెచ్ బ్యాట‌రీ
* వైర్‌లెస్ చార్జింగ్‌, 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌

పిక్స‌ల్ 4 ఫీచర్లు :

* 5.7 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఓలెడ్ డిస్‌ప్లే,
* 2280 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
పైన తెలిపిన ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.